Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras: ఆర్ధిక, ఆరోగ్య సమస్యలా.. నేడు ఈ దేవతలను పూజించి.. యమ దీపం పెట్టండి.. శుభఫలితాలు మీ సొంతం

నేడు ధన్వంతరి భగవంతుని అనుగ్రహం పొందడానికి, సాయంత్రం సంప్రదాయం ప్రకారం ఆయనను పూజించిన తర్వాత.. ప్రసన్నం కోసం 'ఓం నమో భగవతే ధన్వంతరే విష్ణురూపాయ నమో నమః' అని మంత్రాన్ని భక్తి , విశ్వాసంతో జపించండి. ధన్వంతరిని పూజించిన తర్వాత దీపదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

Dhanteras: ఆర్ధిక, ఆరోగ్య సమస్యలా.. నేడు ఈ దేవతలను పూజించి.. యమ దీపం పెట్టండి.. శుభఫలితాలు మీ సొంతం
Dhanteras 2022
Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2022 | 7:24 AM

ప్రతి సంవత్సరం ధన్ తేరాస్ రోజున కుబేరుడిని పూజిస్తారు. కుబేరుడిని పూజించడం వలన జీవితంలో సకల సౌఖ్యాలు లభిస్తాయని ..  ఏడాది పొడవునా ఇంట్లో సంపదకు లోటు ఉండదని నమ్మకం. సంపదకు అధిపతి అయిన కుబేరుడు, సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదని విశ్వాసం. కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశిని ధన్ తేరాస్ అంటారు. ఈరోజు కుబేరుడిని, లక్ష్మీదేవిని, దేవతల వైద్యుడు ధన్వంతరితో కలిసి పూజిస్తారు. నేడు కుబేరుడిని పూజించే విధానం, కలిగే ఫలితాలను గురించి తెలుసుకుందాం..

ఏ పూజ ద్వారా కుబేరుని అనుగ్రహం కలుగుతుందంటే?  హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి. కుబేరుడి అనుగ్రహం కోసం ధన్ తేరాస్ రోజు అత్యంత పవిత్రమైనది, అత్యంత ఫలవంతమైనది. అటువంటి పరిస్థితిలో.. ఎవరైనా జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఎంత కష్టపడి పనిచేసినా మీకు డబ్బులకు ఇబ్బంది పడుతుంటే.. ఈరోజు సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజించడం శుభఫలితాలను ఇస్తుందని నమ్మకం.

జపించాల్సిం మంత్రం: 

ఇవి కూడా చదవండి

కుబేరుడిని సంప్రాదయాన్ని అనుగుణంగా పూజించాలి.’ఓం యక్ష రాజాయ విద్మహే, వైశ్రవణాయ ధీమహే, తన్నో కుబేరాయ ప్రచోదయాత్’ అని 108 సార్లు పఠించాలి. ఇలా చేయడం వలన  మీ ఇంట్లో సిరి, సంపదలకు లోటు ఉండదు. అయితే దీపావళి తర్వాత కూడా కుబేర యంత్రాన్ని ఆరాధించడం, మంత్రాన్ని జపించడం కొనసాగించండి.

ఆరోగ్యం కోసం ధన్ తేరాస్ రోజున పూజ: ధన్‌తేరస్ పండుగను కేవలం సంపదల కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా జరుపుకుంటారు. సముద్ర మథనం సమయంలో ధన్వంతరి భగవానుడు  ధన్ తేరాస్ రోజున జన్మించాడని నమ్ముతారు. కనుక ఈరోజు ధన్వంతరి జయంతిగా జరుపుకుంటారు. నేడు ధన్వంతరి భగవంతుని అనుగ్రహం పొందడానికి, సాయంత్రం సంప్రదాయం ప్రకారం ఆయనను పూజించిన తర్వాత.. ప్రసన్నం కోసం ‘ఓం నమో భగవతే ధన్వంతరే విష్ణురూపాయ నమో నమః’ అని మంత్రాన్ని భక్తి , విశ్వాసంతో జపించండి. ధన్వంతరిని పూజించిన తర్వాత దీపదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ధన్‌తేరస్ రోజున సాయంత్రం దీపదానం చేయడం వల్ల మనిషి జీవితంలో అకాల మృత్యు భయం తొలగిపోతుందని నమ్ముతారు. ఈరోజు ఖచ్చితంగా  ఇంటి తలుపు వద్ద నాలుగు ముఖాల దీపాన్ని అంటే యమ దీపాన్ని వెలిగించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మొబైల్‌ ప్రియులకు షాక్‌..ఐఫోన్ ధర రూ.2 లక్షలు అవుతుందా? కారణం ఇదే
మొబైల్‌ ప్రియులకు షాక్‌..ఐఫోన్ ధర రూ.2 లక్షలు అవుతుందా? కారణం ఇదే
ఈ చిత్రంలో మొదట చూసిందే మీలో దాగున్న వ్యక్తిత్వం.. మీఆలోచనా తీరు
ఈ చిత్రంలో మొదట చూసిందే మీలో దాగున్న వ్యక్తిత్వం.. మీఆలోచనా తీరు
నీటి కోసం యువకుడి వినూత్న నిరసన!
నీటి కోసం యువకుడి వినూత్న నిరసన!
తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?
తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?
బిగ్ అలర్ట్.. ఇవాళ ఒక్కరోజు జాగ్రత్త.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బిగ్ అలర్ట్.. ఇవాళ ఒక్కరోజు జాగ్రత్త.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఏసీ విద్యుత్‌ బిల్లును ఎలా తగ్గించుకోవాలి..? ఇలా చేయండి!
ఏసీ విద్యుత్‌ బిల్లును ఎలా తగ్గించుకోవాలి..? ఇలా చేయండి!
గుడ్లు తినేవారిలో క్యాన్సర్!.. బాంబు పేల్చిన పరిశోధకులు
గుడ్లు తినేవారిలో క్యాన్సర్!.. బాంబు పేల్చిన పరిశోధకులు
పవన్ కళ్యాణ్ ఎన్ని హిట్ మూవీస్ వదులుకున్నారో తెలుసా..
పవన్ కళ్యాణ్ ఎన్ని హిట్ మూవీస్ వదులుకున్నారో తెలుసా..
ఆహా ఓటీటీలోకి వచ్చేసిన హోం టౌన్ వెబ్ సిరీస్.. అసలు మిస్ అవ్వకండి
ఆహా ఓటీటీలోకి వచ్చేసిన హోం టౌన్ వెబ్ సిరీస్.. అసలు మిస్ అవ్వకండి
సింపుల్ లుక్‌లో డ్రాగన్ బ్యూటీ.. కాయదు లోహర్ బ్యూటిఫుల్ ఫొటోస్
సింపుల్ లుక్‌లో డ్రాగన్ బ్యూటీ.. కాయదు లోహర్ బ్యూటిఫుల్ ఫొటోస్