Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi in Ayodhya: నేడు అయోధ్యలో దీపోత్సవం.. సరయు తీరంలో సర్వం సిద్ధం.. తొలిసారి పాల్గొననున్న ప్రధాని మోడీ

అయోధ్యలో ప్రతి సంవత్సరం దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి కూడా అయోధ్య ముస్తాబైంది. దాదాపు 18 లక్షల మట్టి దీపాలను వెలిగించి మరో గిన్నిస్ రికార్డు సృష్టించడానికి సర్వం సిద్ధమైంది

PM Modi in Ayodhya: నేడు అయోధ్యలో దీపోత్సవం.. సరయు తీరంలో సర్వం సిద్ధం.. తొలిసారి పాల్గొననున్న ప్రధాని మోడీ
Pm Modi In Ayodhya
Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2022 | 6:49 AM

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఆదివారం ఘనంగా దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 18 లక్షల మట్టి దీపాలు వెలిగించనున్నారు. ఈ వేడుకలో బాణసంచా, లేజర్ షో ,రాంలీలా కూడా ప్రదర్శించబడతాయి. అయోధ్యలో దీపోత్సవ వేడుకలు నిర్వహించడం ఇది ఆరోసారి. ఈ దీపోత్సవంలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి.. అయోధ్యలో ప్రతి సంవత్సరం దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి కూడా అయోధ్య ముస్తాబైంది. దాదాపు 18 లక్షల మట్టి దీపాలను వెలిగించి మరో గిన్నిస్ రికార్డు సృష్టించడానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని మోడీప్ సమక్షంలో అయోధ్యలో బాణసంచా, లేజర్ షో, రాంలీలా కార్యక్రమాలు జరగనున్నాయి.

సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి వద్ద గ్రాండ్ మ్యూజికల్ లేజర్ షోతో పాటు 3డి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను కూడా ప్రధాని మోడీ వీక్షించనున్నారు. అయోధ్యలో 6వ సారి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. సరయూ నాదీ తీరం ఈ దీపోత్సవానికి రెడీ అయింది. ఇప్పటికే పురాణాల విశిష్టతను తెలిపే విధంగా రామకథ ఆధారంగా 35 స్వాగత ద్వారాలను కూడా వివిధ మార్గాల్లో సిద్ధం చేశారు.

22 వేల మంది వాలంటీర్లు అదే సమయంలో, సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి వద్ద 22,000 మందికి పైగా వాలంటీర్లు 1.5 మిలియన్ల మట్టి దీపాలను వెలిగిస్తారు. మిగిలిన దీపాలను అయోధ్యలోని భారీ కూడళ్లలో, ఇతర ప్రదేశాలలో వెలిగించనున్నారు. ఒక చౌరస్తాలో 256 మట్టి దీపాలను వాలంటీర్లు ఏర్పాటు చేస్తారని దీపోత్సవ నిర్వాహకులు తెలిపారు. రెండు చతురస్రాల మధ్య దూరం రెండు నుండి మూడు అడుగుల వరకు ఉంటుంది. దీపోత్సవంలో లేజర్ షో, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో, బాణాసంచా కూడా ఉంటాయి. రష్యా సహా ఇతర దేశాల కళాకారులు ప్రధాని మోడీ సమక్షంలో రామ్‌లీలాను ప్రదర్శించనున్నారు.

ఇవి కూడా చదవండి

అయోధ్యలో ప్రధాని మోడీ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 గంటలకు పైగా అయోధ్యలో ఉంటారు. దీపోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి రామకథా పార్క్ వద్ద రామ, లక్ష్మణ, సీతలకు హారతి నివ్వనున్నారు. రామ పట్టాభిషేకం అనంతరం.. రామ మందిర నిర్మాణ పనులను కూడా ప్రధాని పరిశీలించనున్నారు. దీంతోపాటు బాణాసంచా కాల్చడం, సరయూ ఆరతి తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో దాదాపు రూ.4,000 కోట్ల విలువైన పథకాలను కూడా ప్రారంభించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..