Russia-Ukraine War: ఉక్రెయిన్ – రష్యా యుద్ధానికి ఏడాది.. కీవ్‌లో జో బైడెన్ ఆకస్మిక పర్యటన.. సాయంపై కీలక ప్రకటన
రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్దం ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తోంది. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకస్మికంగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. కీవ్‌లో బైడెన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఘనస్వాగతం పలికారు.
రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్దం ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తోంది. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకస్మికంగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. కీవ్‌లో బైడెన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఘనస్వాగతం పలికారు. బైడెన్ పర్యటన వేళ ఉక్రెయిన్ గగనతలంలో ఎమర్జెన్సీ సైరెన్లు మోగాయి. వైమానిక దాడి సెరెన్లు మోగడంతో అంతా అలర్టయ్యారు. ఎయిర్ సైరన్ మోగినప్పటికి కీవ్‌లో తన పర్యటనను బైడెన్ కొనసాగించారు. ఉక్రెయిన్-రష్యా యుద్దం తరువాత బైడెన్ కీవ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ పర్యటర సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు బైడెన్. యుద్దం విషయంలో రష్యా అంచనాలు తప్పాయని అన్నారు. ఉక్రెయిన్ చాలా సులభంగా స్వాధీనం చేసుకుంటామని పుతిన్ భ్రమపడ్డారని, కాని అది నిజం కాలేదన్నారు.
వాస్తవానికి బైడెన్ పోలండ్ వెళ్లాలి. కానీ పోలండ్ పర్యటన కంటే ముందే బైడెన్ విమానం కీవ్‌లో ల్యాండయ్యింది. ఈ సందర్భంగా బైడెన్ ఉక్రెయిన్‌కు 500 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు. మారిన్స్కీ ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఒక సంవత్సరం తరువాత కూడా కైవ్ నిలబడి ఉందని.. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ నిలుస్తుందని.. ప్రజాస్వామ్యం గెలుస్తుందని బిడెన్ పేర్కొన్నారు.
Ukraine’s President Volodymyr Zelensky and U.S. President Joe Biden shake hands before a meeting in Kyiv
Source: Reuters pic.twitter.com/gWpIMoovnK
— ANI (@ANI) February 20, 2023
రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్దం 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ యుద్ధానికి ఏడాది పూర్తికానుంది. ఇదే సమయంలో బైడెన్ అక్కడ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇతర పాశ్చాత్య నాయకులు కైవ్‌కు పర్యటన చేశారు. జూన్‌లో, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, అప్పటి ఇటాలియన్ ప్రధాన మంత్రి మారియో ద్రాగి కైవ్‌కి వెళ్లి జెలెన్స్కీని కలిసారు. బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ నవంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కైవ్‌ను సందర్శించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..