Neil Parish: చట్ట సభలో అశ్లీల వీడియోలు చూసిన బ్రిటన్ ఎంపీ రాజీనామా.. పార్టీ సభ్యుల ఒత్తిడితో..
UK MP Neil Parish resigns: బ్రిటన్‌లో చట్టసభలోనే నీలి చిత్రాలను వీక్షించిన అధికార కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశాడు.
UK MP Neil Parish resigns: బ్రిటన్‌లో చట్టసభలోనే నీలి చిత్రాలను వీక్షించిన అధికార కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశాడు. హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడు నీల్ పరీశ్ (65).. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించాడు. హౌస్ ఆఫ్ కామన్స్ ఛాంబర్‌లో తన ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూశానంటూ పరీశ్ అంగీకరిస్తూ రాజీనామా చేశారని అధికారులు వెల్లడించారు. 2010 నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్న నీల్ పారిష్.. తన సొంత పార్టీ సభ్యుల ఒత్తిడి తర్వాత శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించారన్నారు. కాగా.. ఈ విషయంపై పరీశ్ దాటవేస్తూ వస్తున్నారు. కాగా.. బ్రిటన్‌లో మే 5న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అధికార పార్టీకి కీలక కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నీల్ పరీశ్ వ్యవహారంపై మరోసారి దుమారం చెలరేగింది. దీంతోపాటు కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నిబంధనలను ఉల్లంఘించి పార్టీ చేసుకోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పదవికి రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ సభ్యుల నుంచి నీల్ పరీశ్‌పై ఒత్తిడి పెరిగింది.
కాగా.. రాజీనామా అనంతరం నీల్ మాట్లాడుతూ వాస్తవానికి తాను ట్రాక్టర్ల వెబ్‌సైట్ చూసేందుకు యత్నించానని, అది పొరపాటున నీలిచిత్రాల వెబ్‌సైట్‌కు వెళ్లిందంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో మరోసారి కూడా పోర్న్ వీడియోలు చూశానని.. తప్పిదం జరిగిందంటూ పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటన అనంతరం పలువురు ఉద్యోగులు సైతం ఆయనపై ఫిర్యాదులు చేశారు.
Also Read: