Sri Lanka Crisis: తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన ప్రతిపక్షాలు..!

ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు తక్షణమే ఆహార పదార్థాలు, ప్రాణాలను రక్షించే మందులను పంపాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Sri Lanka Crisis: తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన ప్రతిపక్షాలు..!
Chief Minister M K Stalin
Follow us

|

Updated on: May 01, 2022 | 10:42 AM

CM MK Stalin on Sri Lanka Crisis: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు తక్షణమే ఆహార పదార్థాలు, ప్రాణాలను రక్షించే మందులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను పరిశీలించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీలో శుక్రవారం ఒక తీర్మానం ఆమోదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన తరపున శ్రీలంకకు సహాయం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విపక్షాలైన ఏఐఏడీఎంకే, బీజేపీ కూడా మద్దతు పలికాయి. శ్రీలంకకు సహాయంగా పిల్లలకు 40 వేల టన్నుల బియ్యం, 137 రకాల ప్రాణాలను రక్షించే మందులు, 500 టన్నుల పాలపొడి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వాటి అంచనా వ్యయం రూ.123 కోట్లు. ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ ముక్తకంఠంతో స్వాగతించింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర విభాగం తరపున ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు లేఖ రాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని, ఇందులో తమిళనాడు ప్రజలు మొత్తం శ్రీలంకకు సహాయం అందిస్తున్నారని ఈ లేఖలో రాశారు. తమిళనాడు ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిపాదన ప్రకారం, త్వరలో కేంద్ర ప్రభుత్వం సహాయంతో శ్రీలంక ప్రజలకు సహాయ ప్యాకేజీని అందజేస్తుందని అశిస్తున్నామని రాష్ట్ర బిజెపి విభాగం పేర్కొంది.

ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడంతో పాటు, శ్రీలంక తమిళులకు సాయం చేసేందుకు అన్నాడీఎంకే ఉపనేత పన్నీర్‌సెల్వం వ్యక్తిగతంగా రూ.50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. తీర్మానాన్ని సమర్పిస్తూ.. శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలను పొరుగు దేశ అంతర్గత అంశంగా వదిలిపెట్టలేం. మాకు మానవతా సహాయం కావాలి. సహాయం తక్షణమే అందించాలన్నారు.

Read Also….  Patiala Violence: పాటియాలాలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. హింసాకాండ సూత్రధారి అరెస్ట్!

Latest Articles