AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh: చోరీకి వచ్చిన యువకుడు.. పట్టుకుని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కొట్టిన వైనం.. వీడియో వైరల్

Chhattisgarh: మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా చూడు లేదు మానవత్వం నేడు అన్న పాటను గుర్తు చేస్తూ.. రోజు రోజుకీ దేశంలో అనేక దారుణ సంఘటనలు చోటు..

Chhattisgarh: చోరీకి వచ్చిన యువకుడు.. పట్టుకుని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కొట్టిన వైనం.. వీడియో వైరల్
Chhattisgarh News
Surya Kala
|

Updated on: May 01, 2022 | 11:32 AM

Share

Chhattisgarh: మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా చూడు లేదు మానవత్వం నేడు అన్న పాటను గుర్తు చేస్తూ.. రోజు రోజుకీ దేశంలో అనేక దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ యువకుడిని చెట్టుకుని తలక్రిందులుగా వేలాడదీసి చిత్ర హింసలకు గురి చేసిన దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్(Viral Video) కావ‌డంతో ఈ ఘ‌ట‌న పోలీసుల దృష్టికి వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే..

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని ఉచ్ఛ్‌భ‌ట్టీ గ్రామంలోని ఓ ఇంట్లోకి మహవీర్‌ సూర్యవంశీ అనే యువకుడు చొరబడటానికి ప్రయత్నించడంతో అతడిని పట్టుకోడానికి స్థానికులు ప్రయత్నించారు. అయితే యువకుడు తప్పించుకుని పారిపోయాడు.

అయితే గ్రామస్తులు కొందరు నిన్న ఉదయం యువకుడిని పట్టుకుని చెట్టుకి తలక్రిందులుగా కట్టేసి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎవరో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో ఘటనా స్థలానికి వెళ్ళి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత వీడియోలో కనిపిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసాము” అని సాహు చెప్పారు.

నిందితులను మనీష్ ఖరే, శివరాజ్ ఖరే, జాను భార్గవ్‌లను శుక్రవారం ఆలస్యంగా అదుపులోకి తీసుకున్నామని, భీమ్ కేసర్వాణి, 15 ఏళ్ల బాలుడిని శనివారం అదుపులోకి తీసుకున్నామని బిలాస్‌పూర్‌లోని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కొత్వాలి, షెహిల్ సాహు తెలిపారు. బాధితుడు మహావీర్ సూర్యవంశీ అనే కార్మికుడు కూడా నిందితులు ఉండే గ్రామంలో నివసిస్తున్నాడని సాహు చెప్పారు.

“ఏప్రిల్ 26న, నిందితుల్లో ఒకరు సూర్యవంశీ తన ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు.  అయితే సూర్యవంశీ తప్పించుకున్నాడు. మర్నాడు మనీష్ దొంగతనానికి ప్రయత్నిస్తున్నాడని అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. సూర్యవంశీపై మనీష్ కేసు పెట్టలేదు.. పోలీసులు వార్నింగ్ ఇచ్చి విడుదల చేశారు” అని సాహు చెప్పారు.

మనీష్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సూర్యవంశీ మరోసారి తన ఇంటికి చేరుకుని బయట పార్క్ చేసిన తన మోటార్‌సైకిల్‌ను ధ్వంసం చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కోపోద్రిక్తులైన మనీష్, మిగిలిన నలుగురు కలిసి సూర్యవంశీని పట్టుకుని ఇటుక బట్టీ సమీపంలోని చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. నిందితులు సూర్యవంశీని కర్రలతో కొట్టారు, దానిని స్థానిక గ్రామస్థుడు రికార్డ్ చేశాడు, ”అని సాహు చెప్పారు, శుక్రవారం రాత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Also Read: Viral Video: బెడ్ రూమ్‌లో భూతం.. ఆత్మకు హాయ్ చెప్పిన చిన్నారి.. చూసిన తండ్రికి ఫ్యూజులు అవుట్

Yadagiri Gutta: లక్ష్మీనరసింహస్వామి ఆలయం దర్శన, పూజా కైంకర్యాల వేళల్లో మార్పులు.. పూర్తి డీటైల్స్ మీకోసం