AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadagiri Gutta: లక్ష్మీనరసింహస్వామి ఆలయం దర్శన, పూజా కైంకర్యాల వేళల్లో మార్పులు.. పూర్తి డీటైల్స్ మీకోసం

Yadagiri Gutta: తెలంగాణాలో(Telangana) ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం (Sri Lakshmi Narasimha Swami Temple). సరికొత్త హంగులతో అందంగా..

Yadagiri Gutta: లక్ష్మీనరసింహస్వామి ఆలయం దర్శన, పూజా కైంకర్యాల వేళల్లో మార్పులు.. పూర్తి డీటైల్స్ మీకోసం
Yadagiri Gutta Temple
Surya Kala
|

Updated on: May 01, 2022 | 11:11 AM

Share

Yadagiri Gutta: తెలంగాణాలో(Telangana) ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం (Sri Lakshmi Narasimha Swami Temple). సరికొత్త హంగులతో అందంగా ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న యాదాద్రి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. దీంతో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. అయితే తాజాగా లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నేటి నుంచి ఆలయ వేళలు పూజా కైంకర్యాల సమయాలను మార్పు చేసినట్టు దేవస్థాన ఈవో గీతా రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

స్వామి సన్నిధిలో మొక్కు, శాశ్విత ఆర్జిత సేవా కైంకర్యాల్లో పాల్గొనే భక్తులకు స్వామివారి మహా ప్రసాదాలను కొండ పైన దేవస్థాన ప్రసాదాల విక్రయశాల్లో ప్రత్యేక కౌంటర్ ద్వారా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులకు స్వామివారి ప్రసాదంగా లడ్డూ, పుళిహోర, వడ ప్రసాదాలను అందించనున్నారు.

మార్పు చేసిన పూజాకైంకర్యాలు, భక్తుల దర్శన వేళల వివరాలు

సర్వదర్శన వేళలు: ఉదయం 6 నుంచి 7.30 వరకు, తిరిగి 10 నుంచి 11.45 వరకు, మళ్లీ మధ్యాహ్నం 12.30 నుంచి 3 వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు, రాత్రి 8.15 నుంచి 9 వరకు

బ్రేక్‌ దర్శనాలు: స్వామివారిని బ్రేక్ దర్శనంలో దర్శించుకునే భక్తులు ఉదయం 9 నుంచి 10 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సమయం

విశేష పూజలు: తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాజభోగం (ఆరగింపు). మధ్యాహ్నం 3 – 4 గంటల మధ్య ఆలయం మూసివేత.

తిరువారాధన: రాత్రి 7 నుంచి 7.45 వరకు

సహస్రనామార్చన: రాత్రి 7.45 నుంచి 8.15 వరకు, అమ్మ వారికి కుంకుమార్చన.

రాత్రి నివేదన: రాత్రి 9 నుంచి 9.30 వరకు రాత్రి నివేదన చేయనున్నారు

ద్వార బంధనం: 9.30–9.45 శయనోత్సవం

ఆండాళ్‌ అమ్మవారి సేవ: ప్రధానాలయంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: America: డెలావేర్ ఆలయంలో హనుమాన్ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ధ్యాన హనుమాన్ విగ్రహ స్థాపన..

ఏడుకొండలవాడి ప్రసాదానికి ప్రకృతి బియ్యం.. ‘మా పల్లె ట్రస్ట్‌’ ద్వారా సేకరిస్తున్న దిల్ రాజు

 శ్రీవారి దర్శనానికి ఒక్కరే వెళ్తున్నారా.. అక్కడ ఉండడానికి గల సౌకర్యాలు మీకోసం

Muthayya: మనసుకు హత్తుకునే సినిమా ముత్తయ్య.. మూవీ టీజర్ రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ నాని