Tirumala: ఏడుకొండలవాడి ప్రసాదానికి ప్రకృతి బియ్యం.. ‘మా పల్లె ట్రస్ట్’ ద్వారా సేకరిస్తున్న దిల్ రాజు
Tirumala: ఏడుకొండలవాడి ప్రసాదానికి ప్రకృతి బియ్యం ఉపయోగించనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్‌రాజు (Dil Raju) దీనికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యమే మహాభాగ్యం..
Tirumala: ఏడుకొండలవాడి ప్రసాదానికి ప్రకృతి బియ్యం ఉపయోగించనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్‌రాజు (Dil Raju) దీనికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యమే మహాభాగ్యం (Health Is Wealth) అనే నినాదాన్ని చాటి చెబుతున్నారు. కుటుంబ సమేతంగా చూసే ఆహ్లాదకర సినిమాలను నిర్మించడమే కాదు.. ఆరోగ్యకరమైన నినాదాన్ని కూడా అందుకున్నారు నిర్మాత దిల్‌రాజు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు. దానికి తన ఛారిటబుల్ ట్రస్ట్ నుంచే శ్రీకారం చుట్టారు.
నిజామాబాద్ జిల్లా నర్సింగ్‌పల్లిలో ఉన్న మా పల్లె ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రైతుల నుంచి ఆర్గానిక్ బియ్యాన్ని సేకరిస్తున్నారు దిల్‌రాజు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యాన్ని సేకరించి శ్రీవారి ఆలయంలోని ప్రసాదాల కోసం పంపిస్తున్నారు. తిరుమలలోని స్వామి వారి ప్రసాదానికి, నైవేద్యానికి ఈ బియ్యాన్ని ఉపయోగించనున్నారు. నారాయణ కామిని, కృష్ణవ్రీహి, బహురూపి, రత్నచోడి, ఘని అనే ఐదు రకాల బియ్యాన్ని శ్రీవారి ఆలయానికి పంపిస్తున్నారు. ఇందూరు తిరుమల నుంచి తిరుమల తిరుపతికి ప్రకృతి ఫల కైంకర్యం పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కరోనా అందరికీ ఓ గుణపాఠాన్ని నేర్పిందని, ఆరోగ్యం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసిందంటున్నారు దిల్‌రాజు. ఇప్పుడు అందరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందన్నారు. తాజాగా తాను ‘మా పల్లె ట్రస్ట్’ ద్వారా ఆర్గానిక్ బియ్యాన్ని సేకరిస్తున్నానని, ఇలా సేకరించిన బియ్యాన్ని తిరుమలలోని శ్రీవారి ఆలయానికి పంపిస్తున్నానని తెలిపారు. భగవంతుని ప్రసాదం కోసం అతి ప్రాచీనమైన, ప్రాధాన్యమైన బియ్యాన్ని రైతులు పండించి ఇస్తున్నారని దిల్‌రాజు తెలిపారు. ఈ సందర్బంగా సినీ దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హీరో శ్రీకాంత్ తో పాటు పలువురు ఆర్గానిక్ బియ్యం కొనుగోలు చేసి రైతులకు తమ మద్దతు తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి