Mancherial: అంబులెన్స్‌కు రూ. 80 వేలు లేక.. ప్రభుత్వాస్పత్రిలో అందరూ ఉన్నా అనాథ శవంలా పడి ఉన్న మృత దేహం
Mancherial: 'మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే' అని కార్ల్ మార్క్స్ (Karl Marx) ఏనాడో చెప్పాడు. అదే విషయాన్నీ ఇప్పుడు మనుషులు ఆచరించి చూపిస్తున్నారు..
Mancherial: ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని కార్ల్ మార్క్స్ (Karl Marx) ఏనాడో చెప్పాడు. అదే విషయాన్నీ ఇప్పుడు మనుషులు ఆచరించి చూపిస్తున్నారు. మానవత్వాన్ని మరచి ప్రతి విషయానికి డబ్బుతో ముడి పెడుతూ.. ఆటవికంగా నడుచుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ( mancherial government hospital ) దారుణం చోటు చేసుకుంది. మృత దేహాన్ని స్వస్థలానికి తరలించడానికి డబ్బులు లేకపోవడంతో ఆస్పత్రిలోనే శవాన్ని బంధువులు వదిలేసి వెళ్లిన హృదయ విదారక ఘటన జరిగింది. శవాన్ని తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు 80 వేలు డిమాండ్ చేయడంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ కు చెందిన మోతిషా ( 23 ) అనే వలస కూలీ వడదెబ్బ తగలడంతో చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే చికిత్స తీసుకుంటూ మోతిషా మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ లోని స్వగ్రామానికి తరలించేందుకు బంధువులు ప్రయత్నం చేస్తూ.. ప్రైవేట్ అంబులెన్స్ ని సంప్రదించారు. అయితే ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు రూ. 80 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి లేక శవాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోనే మృతుడి సోదరుడు వదిలేశాడు. దీంతో అందరూ ఉన్నా మంచిర్యాల ఆస్పత్రిలోనే మోతిషా మృతదేహాం అనాథ శవంగా పడి ఉంది.