AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vijay Babu: విజయ్ నన్ను లైంగికంగా వేధించాడు అంటున్న మరో మహిళ.. పరారీలో ఉన్న నటుడు.. నేడు ‘అమ్మ’ సమావేశం..

Actor Vijay Babu: మలయాళ(Malayala) నటుడు, నిర్మాత విజయ్ బాబుపై మళ్ళీ ఇంకొక లైంగిక వేధింపుల కేసును( Harassment Case ) కేరళ(Kerala) పోలీసులు నమోదు..

Actor Vijay Babu: విజయ్ నన్ను లైంగికంగా వేధించాడు అంటున్న మరో మహిళ.. పరారీలో ఉన్న నటుడు.. నేడు 'అమ్మ' సమావేశం..
Actor Vijay Babu
Surya Kala
|

Updated on: May 01, 2022 | 7:55 AM

Share

Actor Vijay Babu: మలయాళ(Malayala) నటుడు, నిర్మాత విజయ్ బాబుపై మళ్ళీ ఇంకొక లైంగిక వేధింపుల కేసును( Harassment Case ) కేరళ(Kerala) పోలీసులు నమోదు చేశారు. మరో మహిళ ఇప్పుడు ముందుకు వచ్చి విజయ్ బాబు పనికి సంబంధించిన సమావేశాల సమయంలో తనను వేధించాడని ఆరోపించింది. మరో మలయాళ నటి , విజయ్ బాబు తనను లైంగికంగా వేధింపులకుగురి చేశాడని.. తన అనుమతి లేకుండా పెదవులపై ముద్దు పెట్టాడనే ఆరోపణ చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

విజయ్ బాబు, తనను ఎంతలా వేధించాడో తెలుపుతూ #MeToo ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను నటుడు, నిర్మాత విజయ్‌బాబును 2021 నవంబర్‌లో ఒకసారి కలిశాను. అది కూడా వృత్తి పరంగానే అతడిని కలిసినట్లు తెలిపింది. తాము పని గురించి మాట్లాడుకున్నాం.. అనంతరం… పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ.. నన్ను మందు తాగమని బలవంతం చేశాడు.. అతడు తాగుతూ నా పెదవులపై బలవంతంగా ముద్దు పెట్టాడని సంచలన విషయాలను వెల్లడించింది. అతడి ప్రవర్తనకు షాక్ కు గురయ్యానని చెప్పింది. అంతేకాదు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు అంటూ విజయ్ బాబు తనను బతిమాలినట్లు తెలిపింది. అయితే అతని ప్రవర్తనతో నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరింత ముందుకు వెళ్లకుండా చేసిందని.. అప్పుడు తాను చేస్తోన్న పనిని మధ్యలో ఆపేసినట్లు తెలిపింది. మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న తన కలను అక్కడితోనే తుడిచేశానట్లు తెలిపింది.

హీరోయిన్ అవ్వాల్సిన నేను.. ఆ భయంతో ఇదుగో ఇలా ఉంటున్నాను. ఇటీవల ఓ నటి తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయట పెట్టి.. పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ధైర్యం చేసి తాను బయటకు వచ్చి.. ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

నటుడు విజయ్ బాబు ఆఫీస్ బేరర్‌గా ఉన్న నటీనటుల సంఘం అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్), ఈ సమస్యను చర్చించడానికి ఆదివారం కొచ్చిలో సమావేశం కానున్నది.  మరోవైపు అత్యాచారం ఆరోపణలను ఎదుర్కొంటున్న  విజయ్ బాబు దుబాయ్‌కు పారిపోయాడని ఆరోపణలు వస్తున్నాయి. యూఏఈలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని పాస్‌పోర్ట్ రద్దు చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొచ్చి పోలీస్ కమీషనర్ సిహెచ్ నాగరాజు స్పందిస్తూ.. విజయ్ బాబు పై నమోదైన లైంగిక కేసుల విషయంలో దర్యాప్తు బృందం ఎటువంటి అలసత్వం ప్రదర్శించడం లేదని చెప్పారు. అవసరమైతే అతడిని అదుపులోకి తీసుకునేందుకు విదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Also Read: Manchu Lakshmi: కూతురు విద్యా తో కలిసి బులెట్ బండి సాంగ్‌కు స్టెప్స్ వేసిన మంచువారమ్మాయి..

Tirumala: శ్రీవారి దర్శనానికి ఒక్కరే వెళ్తున్నారా.. అక్కడ ఉండడానికి గల సౌకర్యాలు మీకోసం