AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి దర్శనానికి ఒక్కరే వెళ్తున్నారా.. అక్కడ ఉండడానికి గల సౌకర్యాలు మీకోసం

Tirumala: కలియుగ దైవం కొలువైన పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి(Tirupati). కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి కాదు దేశ విదేశాల..

Tirumala: శ్రీవారి దర్శనానికి ఒక్కరే వెళ్తున్నారా.. అక్కడ ఉండడానికి గల సౌకర్యాలు మీకోసం
Single Traveling To Tirumal
Surya Kala
|

Updated on: May 01, 2022 | 6:24 AM

Share

Tirumala: కలియుగ దైవం కొలువైన పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి(Tirupati). కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి కాదు దేశ విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించుకుంటారు. అయితే తిరుమల గిరులపైకి చేరుకున్న అనంతరం ఉండడానికి ఫ్యామిలీతో వెళ్ళివారికి వసతి గదుల సౌకర్యం ఉంటుంది. మరి అదే ఒక్క మనిషి మాత్రమే వెళ్ళితే అక్కడ ఉండడం ఎలా అనుకుంటారు.  తిరుమల కొండ మీద సింగిల్ పర్సన్ అంటే ఒక వ్యక్తి వెళ్ళితే.. అటువంటి వారికి రూమ్ ఇవ్వరు. మరి అలాంటప్పుడు ఒక్కరే వెళ్తే..  వారి పరిస్థితి ఏంటి అని మీకు సందేహం రావొచ్చు.. అటువంటి వారికోసం పూర్తి వివరాలు..

కొండపై CRO ఆఫీసు ప్రక్కనే PAC ( Pilgrims Amenities Center) 1,2,3,4 అని ఉంటాయి. వీటినే యాత్రీకుల ఉచిత వసతి సౌకర్యాలు అంటారు. కొండపై ఉచిత అన్నదాన సౌకర్యం ఉంటుంది.  స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు ఇక్కడ తమ  దర్శన టిక్కెట్, ఆధార్ కార్డు చూపిస్తే టీటీడీ సిబ్బంది ఉచితంగా లాకర్ ఇస్తారు. ఆ లాకర్ కు తాళం సౌకర్యం కూడా ఉంటుంది. మీ వస్తువులు ఆ లాకర్ లో భద్రపరచుకోవచ్చు. ఇక అక్కడ స్నానానికి ఏర్పాట్లు ఉంటాయి. ఎవరైనా తమ తల నీలాల మొక్కు ఉంటె… అక్క సమీపంలోనే తమ మొక్కులు తీర్చుకోవచ్చు.

అయితే సింగిల్ పర్సన్ కు కొంతమంది కొండమీద మధ్యవర్తులు (దళారులు) లాకర్ ఇప్పిస్తాం, రూమ్ ఇప్పిస్తాం అని అంటారు. వారి మాటలు  నమ్మవద్దు.. ఎందుకంటే.. కొండపై అన్ని సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది. కనుక మీరు మీ ఆధార్ కార్డు తో మీరే స్వయంగా లాకర్ తీసుకోవచ్చు. ప్రస్తుతం కొండపై రద్దీ ఎక్కువ ఉంది. మరోవైపు ఎండలు మండుతున్నాయి. దీంతో తిరుమల వెళ్ళే ప్రతీ భక్తుడికి భక్తితో పాటు సహనం కూడా కలిగి ఉండాలి.  ఒక్క తెలుగు వారు మాత్రమే కాదు.. అనేక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు. కనుక తోటి భక్తులను గౌరవించండి. తిరుమల శ్రీవారిని ప్రశాంత చిత్తంతో దర్శించుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:Health Tips: సరైన నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది.. అసలు ఎవరు ఎన్ని గంటలు నిద్ర పోవాలో తెలుసా?