Queen Elizabeth II funeral: రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు పూర్తి.. అశ్రునయనాల మధ్య ముగిసిన అంత్యక్రియలు..
అశ్రునయనాల మధ్య బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు ఆడంబరంగా జరిగాయి. వరల్డ్ వైడ్‌గా వివిధ దేశాధినేతలు, వేలాది మంది అతిథులు, లక్షలాది మంది బ్రిటన్ పౌరులు క్వీన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 60ఏళ్ల తర్వాత అధికారిక లాంఛనాల మధ్య క్వీన్ ఎలిజబెత్ కు ఘనంగా వీడ్కోలు పలికారు బ్రిటన్ పౌరులు.
ఎంతో ఆడంబరం.. అద్వీతీయం. ఇది బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ -2 అంత్యక్రియల కార్యక్రమం. చివరిసారిగా విన్‌స్టన్ చర్చిల్‌కు 60ఏళ్ల క్రింత ఆడంబరంగా వీడ్కోలు పలికిన బ్రిటన్ పౌరులు .. ఇవాళ అంతకు మించి క్వీన్ అంత్యక్రియలు నిర్వహించారు. మొదట వెస్ట్‌మిన్‌స్టర్ అబేకు తీసుకెళ్లారు క్వీన్ రాణి పార్థివ దేహాన్ని. అక్కడ దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రముఖుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నివాళులు అర్పించారు. రాణి అంత్యక్రియల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోపాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2వేల మంది ప్రముఖులు పాల్గొన్నారు. అంత్యక్రియలు జరిగిన వెస్ట్‌మిన్‌స్టర్ అబే చర్చిలోనే బ్రిటన్ రాజు,రాణుల పట్టాభిషేకం జరుగుతుంది. 1947లో రాణి ఎలిజబెత్, ఫిలిప్‌ల వివాహం కూడా ఇక్కడే జరిగింది. అబేలో ప్రార్థనలు జరిగే సమయంలో అక్కడున్న గంటను 96 సార్లు మోగించారు. రాణి ఎలిజబెత్ బతికున్న 96 ఏళ్లకు గుర్తుగా ఈ గంట అన్నిసార్లు మోగించారు.
యువరాణి ఎలిజబెత్, ఫిలిప్ మౌంట్‌బెటన్ పెళ్లి రోజున పాడిన దైవస్తుతులను అంత్యక్రియల వేళ పాడారు. 1947లో ఆమె పెళ్లి రోజున పాడిన పామ్ 23కి చెందిన కొన్ని కీర్తనలను మరోసారి ఆలపించారు. ద లార్డ్ ఈజ్ మై షప్‌హార్డ్, ఐ విల్ నాట్ వాంట్ అన్న సాంగ్ ను పాడారు.
వెస్ట్‌మిన్‌స్టర్ అబే చర్చిలో ప్రార్థనలు పూర్తైన తర్వాత.. విండ్సర్ క్యాసిల్‌లో అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి రాయల్ నేవీ స్టేట్ గన్ క్యారేజ్‌లో రాణి పార్థివ దేహాన్ని తరలించారు. కిలో మీటర్ల మేర ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని క్వీన్ పార్ధివ దేహానికి వీడ్కోలు పలికారు. సన్నిహితుల సమక్షంలో విండ్సర్ క్యాసిల్‌లో రాణి ఎలిజబెత్‌ను ఖననం చేశారు. గతేడాది కన్నుమూసిన రాజు ఫిలిప్ సమాధి పక్కనే ఎలిజబెత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం