Tomato Price: కిలో టమాట రూ.200, చికెన్‌ ఏకంగా రూ.700.. ధరల అదుపుకు ఆ దేశంలో 144 సెక్షన్‌ విధింపు

వారం క్రితం కిలో టమోటా రూ.100 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.200కు చేరుకుంది. కేవలం 7 రోజుల వ్యవధిలోనే వంద రూపాయలు పెరగడంతో సామాన్యులు కొనలేక అల్లాడుతున్నారు. ఎక్కడో కాదు.. మన దాయాదులు పాకిస్థాన్‌లో పరిస్థితి ఇదీ. అక్కడ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఈద్ అల్-అదా పండుగ నేపథ్యంలో అక్కడ నిత్యవసర వస్తుల ధరలు మరింత పెరిగాయి. పండ్లు, కూరగాయల ధరలు అకాశాన్ని..

Tomato Price: కిలో టమాట రూ.200, చికెన్‌ ఏకంగా రూ.700.. ధరల అదుపుకు ఆ దేశంలో 144 సెక్షన్‌ విధింపు
Tomato Price
Follow us

|

Updated on: Jun 18, 2024 | 8:24 AM

లాహోర్‌, జూన్‌ 18: వారం క్రితం కిలో టమోటా రూ.100 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.200కు చేరుకుంది. కేవలం 7 రోజుల వ్యవధిలోనే వంద రూపాయలు పెరగడంతో సామాన్యులు కొనలేక అల్లాడుతున్నారు. ఎక్కడో కాదు.. మన దాయాదులు పాకిస్థాన్‌లో పరిస్థితి ఇదీ. అక్కడ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఈద్ అల్-అదా పండుగ నేపథ్యంలో అక్కడ నిత్యవసర వస్తుల ధరలు మరింత పెరిగాయి. పండ్లు, కూరగాయల ధరలు అకాశాన్ని అంటడంతో ఇదే అదనుగా ధరలను వ్యాపారులు అమాంతం పెంచేశారు. ఇక లాహోర్‌లోని పండ్లు, కూరగాయల విక్రేతలు టమోటా ధరలను పెంచుకుంటూ పోతున్నారు. దీంతో ధరలు అదుపు చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. తాజాగా టమోటాల రవాణాపై నిషేధం విధిస్తూ 144 సెక్షన్‌ను ప్రకటించ వల్సిన పరిస్థితి నెలకొంది. పెషావర్ డిప్యూటీ కమిషనర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

పాక్‌ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మార్కెట్ ధరలు మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను వ్యాపారులు భేకాతరు చేస్తున్నారు. ప్రభుత్వ ధరలను రెట్టింపు చేసి కూరగాయలను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా పచ్చిమిర్చి, నిమ్మ కాయల ధరలు రెట్టింపయ్యాయి. అల్లం, వెల్లుల్లిని 40 నుంచి 50 శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిమ్మ కిలో రూ.480 చొప్పున అమ్ముతున్నారు. చికెన్‌ ధర కిలో అధికారికంగా రూ.494 ఉంటే.. వ్యాపారులు మాత్రం ఇష్టారీతిలో రూ.56లు పెంచేసి కిలో రూ520 నుంచి రూ.700లకు విక్రయిస్తున్నారు.

బంగాళాదుంపల ధర కిలో 75 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. మరోవైపు పాక్‌ ప్రభుత్వం ఎ- గ్రేడ్‌ ఉల్లి ధరలను కిలో రూ.100 నుంచి 105గా నిర్ణయిస్తే.. మార్కెట్లో కిలో రూ.150గా ఉంది. గత సంవత్సరం కూడా ఈద్-ఉల్-అజా సమయంలో పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.