Himalayas: హిమాలయాల్లో కొత్త పాము జాతులు వెలుగులోకి..ప్రముఖ హాలీవుడ్ నటుడు పేరు నామకరణం.. ఎందుకంటే
ప్రకృతిలోని విషపు జీవుల్లో పాములు కూడా ఒకటి. ఎన్నో రకాల పాములు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా హిమాలయాల్లో కొత్త జాతి పాము కనుగొనబడింది. హిమాలయాల్లో కనుగొనబడిన ఈ కొత్త జాతి పాము పేరు లియోనార్డో డికాప్రియో. హాలీవుడ్ నటుడైన లియోనార్డో డికాప్రియో గౌరవార్థం హిమాలయాల్లోని పరిశోధకుల బృందం కొత్త పాముకి ఈ పేరు పెట్టారు. జంతు సంరక్షణకు నిర్మాత, నటుడు చేసిన కృషికి గౌరవార్థం పాముకి లియోనార్డో డికాప్రియో అని పేరు పెట్టినట్లు ఆ బృందం తెలియజేసింది.
హిమాలయాల్లో కొత్త జాతి పాము కనుగొన్నారు ఓ పరిశోధకుల బృందం. ఈ కొత్త పాముకి హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో పేరు పెట్టారు. హాలీవుడ్ నటుడి గౌరవార్థం హిమాలయాల్లోని పరిశోధకుల బృందం జంతు సంరక్షణ కోసం చేసిన కృషికి గౌరవార్థం పాముకి అతని పెట్టినట్లు పరిశోధనల బృందం చెప్పారు. భారతదేశంలో సరీసృపాలపై చేపట్టిన ప్రాజెక్ట్‌లో భాగంగా 2020లో భారతదేశం, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్‌లకు చెందిన పరిశోధకుల బృందం సంయుక్తంగా పరిశోధన చేయడం మొదలు పెట్టింది. పీర్-రివ్యూడ్ జర్నల్ అయిన సైంటిఫిక్ రిపోర్ట్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారంన పామును అంగులస్ అనే కొత్త జాతి క్రింద వర్గీకరించింది. అంటే చిన్న జాతి పాముగా నిర్ధారించారు.
పరిశోధకుల బృందం పశ్చిమ హిమాలయాల్లోని పర్వత ప్రాంతాలను సందర్శించింది. మురికి రహదారిపై కొన్ని గోధుమ పాములను చూసింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ పాము పట్టుకోగానే ఎటూ కదలకుండా ఉండిపోయింది. అంతేకాదు కాటు వేయడానికి కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, కులు ప్రాంతాలు, ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ సహా నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్‌లో కూడా ఈ కొత్త జాతి పాములు కనుగొనబడ్డాయి అని జోరామ్ విశ్వవిద్యాలయంలోని జువాలజీ విభాగం ప్రొఫెసర్, సభ్యుడు హెచ్‌టి లాల్‌రెంసంగా తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..