AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: దారుణం.. ఎంట్రీ లేదని చెప్పడమే తప్పా.. కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు..!

తమిళనాడులోని మహాబలిపురంలో టూరిస్ట్‌లు రెచ్చిపోయారు. ఓ వాలంటీర్‌ను ఎడాపెడా చితకబాదారు. నలుగురూ కలిసి విచక్షణారహితంగా కొట్టారు. కొట్టొద్దని వాలంటీర్‌ కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు.

Watch Video: దారుణం.. ఎంట్రీ లేదని చెప్పడమే తప్పా.. కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు..!
Security Guard Attacked
Balaraju Goud
|

Updated on: Oct 22, 2024 | 4:31 PM

Share

తమిళనాడులోని మహాబలిపురంలో టూరిస్ట్‌లు రెచ్చిపోయారు. ఓ వాలంటీర్‌ను ఎడాపెడా చితకబాదారు. నలుగురూ కలిసి విచక్షణారహితంగా కొట్టారు. కొట్టొద్దని వాలంటీర్‌ కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. ఇష్టం వచ్చినట్టు తలో చోట చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడయాలో వైరల్ కావడంతో తమిళనాడు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మహాబలిపురానికి ఓ ఫ్యామిలీ కారులో వెళ్లింది. అయితే ఎంట్రీ లేదని కారుని వాలంటీర్‌ అడ్డుకున్నాడు. అయినా వినకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు కారు డ్రైవర్‌. దీంతో కారుకు అడ్డుగా వచ్చిన వాలంటీర్‌పైకి కారు పోనిచ్చాడు. అంతేకాదు ఈ క్రమంలోనే కారు దిగిన ఇద్దరు మహిళలు.. వాలంటీర్‌పై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు వాళ్లకి తోడయ్యారు. అంతా కలిసి వీర కుమ్ముడు కుమ్మారు.

వాలంటీర్‌పై టూరిస్ట్‌ల దాడి చేసిన దృశ్యాలను అక్కడే ఉన్న మరొకరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ యవ్వారం కాస్తా, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రభుదాస్‌, కీర్తన, షణ్ముఖ ప్రియను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వీడియో చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వర్షాకాలంలో బొప్పాయి తింటే ఏమవుతుంది? ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో బొప్పాయి తింటే ఏమవుతుంది? ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..
అమ్మవారి ఆలయంలో అదృశ్య మేక ప్రత్యక్షం..దగ్గరికెళితే మాయం!
అమ్మవారి ఆలయంలో అదృశ్య మేక ప్రత్యక్షం..దగ్గరికెళితే మాయం!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో వారం పాటు వర్షాలు!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో వారం పాటు వర్షాలు!
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాపై కేంద్రం కీలక ప్రకటన
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాపై కేంద్రం కీలక ప్రకటన
షిర్డీ వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి 3 రోజుల టూర్..
షిర్డీ వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి 3 రోజుల టూర్..
అతనిలా నటించడం ఎవరివల్ల కాదు..!
అతనిలా నటించడం ఎవరివల్ల కాదు..!
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్..
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్..
100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన