బ్రిక్స్ కోసం రష్యా చేరుకున్న ప్రధాని మోదీ.. కృష్ణ భజనలతో ఘన స్వాగతం పలికిన రష్యా ప్రజలు..
అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు రష్యా అధ్యక్షతన కజాన్‌లో 16వ బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ రష్యాలోని కజాన్ నగరానికి చేరుకున్నారు. ఇక్కడ విమానాశ్రయంలో మన ప్రధాని నరేంద్ర మోడీకి భారతీయులు సహా రష్యన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారతీయ సాంప్రదాయ దుస్తులైన ధోతీ, చీరలు ధరించి సుస్పష్టంగా కృష్ణుడిని కీర్తిస్తూ రెండు చేతులు జోడించి ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ రోజు రష్యా అధ్యక్షుడి పుతిన్ లో ప్రధానమంత్రి మోడీ భేటీ కానున్నారు.
రష్యా అధ్యక్షతన 16వ బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యాలోని కజాన్ నగరానికి చేరుకున్నారు. 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు కజాన్‌కు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ కజాన్ కు చేరుకున్నారు. అయితే భారత ప్రధాని మోడీ.. కజాన్ విమానాశ్రయంలో ఘనం స్వాగతం లభించింది. భారతీయులు సహా రష్యన్ ప్రజలు భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి భారీగా తరలి వచ్చిన ప్రజలు ప్రధాని మోడీకి కృష్ణ భజనలను కీర్తిస్తూ స్వాగతం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నేట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
రష్యన్ కమ్యూనిటీకి చెందిన కళాకారులు భారతీయ దుస్తులు ధరించి నృత్యం చేసి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. రష్యా పౌరులు భారతీయ దుస్తులను ధరించగా.. మహిళలు చీరలో కనిపించారు. కాగా పురుషులు ఖాదీ కుర్తా, ధోతీ ధరించారు.
ప్రధాని మోడీ భారతీయ ప్రవాసులను కలిశారు, ప్రతిచోటా ప్రజల చేతుల్లో త్రివర్ణ పతాకం కనిపించింది. ప్రధానమంత్రిని చూడటానికి ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రధాని మోడీ పలువురితో కరచాలనం చేసి చిన్నారులను ఆశీర్వదించారు. పలువురితో ఫొటోలు కూడా దిగారు. రష్యాలో దాదాపు 62 వేల మంది భారతీయ వలసదారులు నివసిస్తున్నారు.
బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన తన సహచరులతో కూడా ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. బ్రిక్స్ సదస్సుకు భారతదేశం చాలా ప్రాముఖ్యతనిస్తుంది. రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ , ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో మాట్లాడనున్నారు. బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు విస్తృతమైన అంశాలపై చర్చిస్తారని భావిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..