AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UNSC Seat For India: భారత్‌కు తప్ప.. ఏ ఇతర దేశానికి ఆ అర్హత లేదు: జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్

ప్రపంచంలో ఇండియా మార్క్.. ఒకప్పటికీ.. ఇప్పటికీ చాలా తేడా ఉంది.. దశబ్దాల నాటి పరిస్థితులు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు.. ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తున్న అగ్ర దేశాలలో భారత్ కూడా ఒకటి అని చాటి చెబుతోంది.. ముఖ్యంగా దీనికి నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు.. ముందుచూపు దీనికి కారణమని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు.

UNSC Seat For India: భారత్‌కు తప్ప.. ఏ ఇతర దేశానికి ఆ అర్హత లేదు: జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్
Unsc Seat For India
Shaik Madar Saheb
|

Updated on: Oct 22, 2024 | 2:06 PM

Share

ప్రపంచంలో ఇండియా మార్క్.. ఒకప్పటికీ.. ఇప్పటికీ చాలా తేడా ఉంది.. దశబ్దాల నాటి పరిస్థితులు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు.. ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తున్న అగ్ర దేశాలలో భారత్ కూడా ఒకటి అని చాటి చెబుతోంది.. ముఖ్యంగా దీనికి నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు.. ముందుచూపు దీనికి కారణమని.. ఇదే భారతదేశాన్ని అన్ని రంగాలలో  అగ్రస్థానంలో నిలుపుతోందని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు.. అంతేకుండా ఆర్థిక వ్యవస్థ బలంగా మారడంతోపాటు.. దౌత్య వ్యవహారాల్లో భారత్ కీలకంగా వ్యవహరించడం దీనికి ఉదహారణ.. ఈ విషయాలకు బలం చేకూరుస్తూ తగినట్లుగానే.. భారతదేశం – భూటాన్‌లోని జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత స్థానం పొందేందుకు భారతదేశం ఇతర దేశాల కంటే ఎక్కువ అర్హత కలిగి ఉందని జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏ ఇతర దేశానికి అర్హత లేదంటూ నొక్కిచెప్పారు. జీ20 డిక్లరేషన్ భారత్ లేకుండా సాధ్యం కాదంటూ ఆయన చెప్పడం చర్చనీయాంశంగా మారింది..

సోమవారం జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో భారతదేశం – భూటాన్‌లోని జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రధాన దేశాలలో భారతదేశం ఒకటిగా మారిందంటూ పేర్కొన్నారు. ప్రపంచ సమీకరణాలలో భారతదేశం ఒక ముఖ్యమైన భాగమని.. ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటిగా ఎదగాలని డాక్టర్ అకెర్‌మాన్ ఉద్ఘాటించారు. “భారత్ లేకుండా G20 డిక్లరేషన్ సాధ్యం కాదు. రష్యా, పశ్చిమ దేశాలు ఉన్నప్పటికీ.. భారతదేశం దాని ప్రాబల్యాన్ని, బలాన్ని చూపుతూ సంతృప్తికరమైన ఫలితాన్ని సాధించింది” అంటూ పేర్కొన్నారు.

‘జియో-పొలిటికల్ డిస్ట్రప్షన్స్: ఎమర్జింగ్ పవర్స్ వర్సెస్ ఎగ్జిస్టింగ్ పవర్స్’ అనే సెషన్‌లో.. UNలో మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పశ్చిమాసియా అంశాన్ని కూడా లేవనెత్తారు.. ఇక్కడ పలు దేశాల నేతలు సవాలు చేస్తున్నారని.. ఇజ్రాయెల్-హమాస్-హిజ్బుల్లా వివాదాన్ని ప్రస్తావిస్తూ.. మారుతున్న పరిస్థితులు విపరీతమైన పరిణామాలను కలిగిస్తాయని అన్నారు.

భారతదేశ ఆర్థిక.. రాజకీయ ప్రయోజనాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉనికి.. ఇంధన ధరలు వంటి అంశాల దృష్ట్యా పశ్చిమాసియా కూడా న్యూఢిల్లీకి ఒక సమస్యగా మారుతుందని ఆసియా గ్రూప్ భాగస్వామి అశోక్ మాలిక్ అభిప్రాయపడ్డారు. దీనికి, అక్బరుద్దీన్ స్పందిస్తూ.. “ప్రపంచ క్రమాన్ని రీసెట్ చేయడం సవాలుగా ఉంటుంది. సవాళ్లు దేశం నుంచి దేశాలకు మాత్రమే కాకుండా.. వాతావరణం, కృత్రిమ మేధస్సు, అంతరిక్షం నుండి కూడా వస్తాయని.. వీటికి పరిష్కారం భాగస్వామ్యాల ద్వారా మాత్రమే అవుతుంది.. అంటూ పేర్కొన్నారు.

భారతదేశం-కెనడా మధ్య జరుగుతున్న దౌత్యపరమైన వివాదంపై మాలిక్ మాట్లాడుతూ,.. దేశాలు సాధారణంగా దౌత్యవేత్తలను బహిష్కరించడం, వాటి పరిణామాలను పరిష్కరించేదిబోయి… ప్రధానమంత్రి మీడియా సమావేశం నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు.

ఇదిలావుండగా.. బ్రౌన్ నుండి గ్రీన్ ఎనర్జీకి తరలింపులో స్వల్పకాలిక పర్యావరణాన్ని రక్షించడం వంటికి దీర్ఘకాలికంగా ఆలోచించాలని భారతదేశంలోని బ్రెజిల్ రాయబారి కెన్నెత్ హెచ్ డా నోబ్రేగా సూచించారు.

పునరుత్పాదక విభాగంలో భారతీయ ప్రైవేట్ రంగం పనిని ప్రశంసిస్తూ .. భారతదేశ ప్రమేయం లేకుండా ఏ వాతావరణ పోరాటమైనా వ్యర్థమని అకెర్‌మాన్ అన్నారు. అంతేకాకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో వివిధ దేశాలు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నందున, వాతావరణ పరివర్తన కష్టం.. సంక్లిష్టమైనది అని అక్బరుద్దీన్ హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..