Flights Bomb Threats: మరోసారి ఇండిగో విమానాలకు బెదిరింపులు..ఈ వారంలోనే 120 సార్లు..
10 ఇండిగో విమానాలకు తాజాగా మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇండిగోతో పాటు సోమవారం, మంగళవారం రోజుల్లో 10 విస్తారా విమానాలు కూడా భద్రతా హెచ్చరికలను అందుకున్నట్లు తెలుస్తుంది.
దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో నడిచే 10 ఇండిగో విమానాలకు తాజాగా మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.ఇండిగో విమానాలు 6E-63 ఢిల్లీ జెడ్డా, 6E-12 ఇస్తాంబుల్-ఢిల్లీ, 6E-83 ఢిల్లీ-దమ్మామ్, 6E-65 కోజికోడ్-జెడ్డా, 6E-67 హైదరాబాద్-జెడ్డా, 6E-77 బెంగళూరు-జెడ్డా, 6E- 18 ఇస్తాంబుల్-ముంబై, 6E-164 మంగళూరు-ముంబై, 6E-118 లక్నో-పూణే మరియు 6E-75 అహ్మదాబాద్-జెడ్డా, ఎయిర్‌లైన్‌లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పేర్కొ్ంది.
ఇండిగోలో తమ కస్టమర్లు, సిబ్బంది భద్రత తమకు ముఖ్యమని ఎయిర్‌లైన్ తెలిపింది. తమ కస్టమర్లకు అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇండిగోతో పాటు సోమవారం, మంగళవారం రోజుల్లో 10 విస్తారా విమానాలు కూడా భద్రతా హెచ్చరికలను అందుకున్నట్లు తెలుస్తుంది. దీంతో విమానాశ్రయాలు, విమానాలలో క్షుణ్ణంగా భద్రతా తనిఖీలు చేపట్టారు. ఒక వారం వ్యవధిలో భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 120 కంటే ఎక్కువ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు చాలా వరకు బూటకమని తేలినప్పటికీ, అటువంటి సంఘటనల సమయంలో తప్పనిసరిగా అనుసరించాల్సిన ప్రోటోకాల్‌ల కారణంగా విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.