AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teacher Missing Case: చెరువులో తేలియాడుతున్న గోనె సంచి.. తెరిచి చూసిన పోలీసులు షాక్!

అక్టోబర్ 19వ తేదీ ఉదయం చాకియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైవేట్ ఉపాధ్యాయుడు బిట్టు కుమార్ కోచింగ్‌ సెంటర్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు.

Teacher Missing Case: చెరువులో తేలియాడుతున్న గోనె సంచి.. తెరిచి చూసిన పోలీసులు షాక్!
Ai Photo Generated
Balaraju Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 22, 2024 | 8:34 PM

Share

బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఉపాధ్యాయుడి దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ముక్కలు ముక్కలుగా కోసి, గోనె సంచిలో చుట్టిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ వార్త వ్యాపించడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. మృతుడిని 24 ఏళ్ల బిట్టు కుమార్‌గా గుర్తించారు. అక్టోబర్ 19న బిట్టు స్నేహితుడి నుంచి రూ.600 తీసుకున్నాడు. పాట్నా వెళుతున్నానని చెప్పాడు. ఇంతలో చెరువులో గోనె సంచిలో కట్టి ముక్కలుగా కోసిన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అది కోచింగ్ టీచర్ బిట్టుదిగా నిర్ధారించారు.

బిట్టును ఎవరు ఎందుకు హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అక్టోబర్ 19వ తేదీ ఉదయం చాకియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైవేట్ ఉపాధ్యాయుడు బిట్టు కుమార్ కోచింగ్‌ సెంటర్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం తన స్నేహితుడు సుమిత్ వద్దకు వెళ్లాడు. అక్కడ అతని వద్ద రూ.600 అప్పుగా తీసుకున్నాడు. బిట్టు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు.

ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై, సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిట్టు కోసం వెతుకులాట ప్రారంభించారు. అప్పుడు చెరువు దగ్గర ఓ గోనె సంచిని గుర్తించారు. గోనె సంచిని తెరవగానే పోలీసులు షాక్‌కు గురయ్యారు. లోపల ముక్కలు ముక్కలుగా నరికిన మృతదేహం ఉంది. మృతదేహానికి తల, ఒక చేయి, రెండు కాళ్లు కనిపించలేదు. అతడి జేబులో ఆధార్‌కార్డును చూడగా అది బిట్టు మృతదేహాం అని తేలింది. అతని మిగిలిన శరీర భాగాల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం చాకియా పోలీస్ స్టేషన్ పరిధిలోని థర్మల్ హాల్ట్ సమీపంలో మృతదేహంతో కూడిన ఈ గోనె సంచిని పోలీసులు గుర్తించారు.

మృతదేహంలోని మిగిలిన ముక్కలను కనుగొనే పనిలో పోలీసు బృందాలు నిమగ్నమయ్యాయి. బిట్టు కోచింగ్ సెంటర్‌లో టీచింగ్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్, SSC రిక్రూట్‌మెంట్ కోసం కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా, బిట్టును ఊరి చుట్టుపక్కల ఎక్కడో హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే గోనె సంచిలో కట్టిన తాడును ఎన్‌టీపీసీలో బొగ్గు లోడ్ చేయడానికి ఉపయోగిస్తారు. బిట్టును ఇంత కిరాతకంగా ముక్కలు చేసి ఎవరు ఎందుకు హత్య చేశారో పోలీసుల విచారణ తర్వాతే తేలిపోతుంది..!

ఈ విషయమై ఎస్పీ మనీష్ స్పందించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. సదరు డీఎస్పీ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. బిట్టు ఎవరితో కాంటాక్ట్‌లో ఉన్నాడో తెలుసుకోవడానికి అతని కాల్ వివరాలను కూడా పరిశీలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..