13 October 2024
TV9 Telugu
Pic credit - Getty
ప్రకృతి సృష్టించిన ఈ భూమి తనదైన ప్రత్యేకతను కలిగి ఉంది. భూమి మీద వింతలు ప్రతిసారీ మానవులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.
ప్రకృతిలోని వింతలకు సంబంధించిన వాస్తవాలు మన ముందుకు వచ్చినప్పుడల్లా ఆశ్చర్యానికి గురి కావడానికి కారణం ఇదే.
ఓ వైపు మనదేశంలో జనాభా రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అదే సమయంలో ఈరోజు వరకూ ఓ దేశంలో 95 ఏళ్లుగా పిల్లలు పుట్టలేదు. ఆ దేశం గురించి తెలుసుకుందాం..
ఇది మాత్రమే కాదు ఈ దేశంలో ఎవరికీ శాశ్వత పౌరసత్వం లభించదు. అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ ఇక్కడ తాత్కాలిక పౌరులే.
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన వాటికన్ సిటీ..ప్రపంచంలోనే అతి చిన్న పూర్తి స్వతంత్ర దేశం. ఈ దేశం పోప్ పాలనలో ఉంది.
ఈ దేశం 1929 ఫిబ్రవరి 11న జన్మించింది. ఆశ్చర్యం ఏంటంటే 95 ఏళ్లు దాటినా ఇక్కడ మళ్ళీ ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు.
ఇక్కడ ఎవరైనా గర్భిణి డెలివరీ తేదీ దగ్గరకు వస్తే ఇక్కడి నిబంధనల ప్రకారం బిడ్డకు జన్మనిచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి.