స్మార్ట్  ఇన్సులిన్.. ఇక డయాబెటీస్ బెంగ తీరినట్టేనా ??

స్మార్ట్ ఇన్సులిన్.. ఇక డయాబెటీస్ బెంగ తీరినట్టేనా ??

Phani CH

|

Updated on: Oct 22, 2024 | 12:54 PM

డయాబెటీస్... 50 కోట్ల మందిని సైలెంట్‌గా చావుకు దగ్గరగా తీసుకెళ్తున్న వ్యాధి. డాక్టర్లు డయాబెటీస్ వచ్చినా నష్టం లేదని.. దాంతో కలిసి జీవించడం నేర్చుకోవాలని ధైర్యం చెబుతున్నప్పటికీ... ఒక్కసారి ఆ వ్యాధి సోకిందంటే ఎంతో కంట్రోల్‌లో ఉంచుకుందామని ట్రై చేసినా... పదేళ్లకే, 20 ఏళ్లకో శరీరంలో ఒక్కో ఆర్గాన్ నెమ్మది నెమ్మదిగా మొరాయించడం మొదలెడుతుంది. ఈ విషయం ఓపెన్ సీక్రెట్.

ఏటా ఎంత లేదనుకున్నా ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ కారణంగానే 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే డయాబెటీస్ విషయంలో యావత్ వైద్యలోకం అంత సీరియస్‌గా ఎఫెర్ట్స్ పెడుతోంది. ఒకసారి డయాబెటీస్ సోకిన వాళ్లకు తమ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకోవడం సవాల్‌గా మారుతుంటుంది. వ్యాధి తీవ్రత బట్టీ కొందరికి మాత్రలతో కంట్రోల్‌ చెయ్యగల్గుతుంటే.. మరి కొందరికి మాత్రం ఇన్సులిన్ ఇవ్వక తప్పని పరిస్థితి. అంటే శరీరంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని అందుకు అనుగుణంగా ఇన్సూలిన్ తీసుకోవాలి. ఇది… నిజానికి అలవాటైపోయిన లేదా అలవాటు చేసుకున్న డయాబెటీస్ రోగులకు ఫర్వాలేదేమో కానీ… కొత్తగా ఇన్సులిన్ వాడే వాళ్లకు మాత్రం నిజంగా ఇబ్బందికర పరిస్థితే. అలాంటి వారి కోసం ఇన్సులిన్ సెన్సార్ ప్యాచ్‌ల వంటి అనేక రకాల పరికరాలొచ్చాయి. అయితే ఈ సెన్సార్ ప్యాచ్‌లు కేవలం మన శరీరంలో షుగర్ లెవల్స్‌లో హెచ్చుతగ్గుల్ని మాత్రమే గుర్తిస్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో !!

హౌస్‌లో ఏడు వారాలు.. అందులో ఏడుపులు !! కానీ రెమ్యునరేషన్‌ భారీగానే గుంజాడుగా

Bigg Boss Manikanta: అదృష్టాన్ని కాలదన్నుకున్న దురదృష్టవంతుడు

Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌ పిటిషన్‌..

బన్నీ కోసం రంగంలోకి స్త్రీ2 హీరోయిన్.. ఇక నార్త్‌ షేక్ అవడం పక్కా.. అంతే

Published on: Oct 22, 2024 12:51 PM