గుర్లలో ఏం జరిగింది ?? డయేరియా వ్యాప్తి వెనుక నిజాలు ఏంటి ??

గుర్లలో ఏం జరిగింది ?? డయేరియా వ్యాప్తి వెనుక నిజాలు ఏంటి ??

Phani CH

|

Updated on: Oct 22, 2024 | 12:55 PM

దాహాన్ని తీర్చాల్సిన మంచినీరు.. ప్రాణాలు తీస్తోంది. అమృతంలా గొంతు దిగాల్సిన జలం.. గరళంలా మారుతోంది. కలుషిత నీటిని తాగితే మనిషికి అనారోగ్యం తప్పదు. డయేరియా రూపంలో పంజా విసురుతుంది. ఒక్కోసారి అది ప్రాణాలనూ బలి తీసుకుంటుంది. దాదాపు మూడు వేల జనాభా ఉండే విజయనగరం జిల్లా గుర్లలో జరిగింది.. ఇదే. అక్కడ.. డయేరియా దెబ్బతో ఊరంతా అనారోగ్యం పాలైంది. వాంతులు, విరోచనాలతో అల్లాడుతోంది.

పారిశుధ్యం లోపించడం, నీటి కాలుష్యం వల్ల.. డయేరియా విజృంభించింది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఈ అంశం.. రాజకీయరంగు పులుముకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్షాలు.. విమర్శలు, ఆరోపణల దాడి చేసుకుంటున్నాయి. ఇంతకీ గుర్లలో ఏం జరిగింది? డయేరియా వల్ల అక్కడ ఎలాంటి విషాదం చోటుచేసుకుంది? అక్కడి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తోంది? విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం వల్ల కర్ఫ్యూలాంటి వాతావరణం నెలకొంది. ఊళ్లో వారంతా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో.. ప్రభుత్వం కూడా వెంటనే స్పెషల్ హెల్త్ క్యాంప్స్ ను ఏర్పాటు చేసింది. అధికారులు, మంత్రులు ఇక్కడ పర్యటించారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ డయేరియా వల్ల 11 మంది చనిపోయారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం మాత్రం డయేరియాతో ఒక్కరే ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. మిగిలినవారంతా వివిధ ఆరోగ్య సమస్యలతో మరణించారు అని అంటోంది. ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అక్కడ పర్యటించడం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. గుర్ల PHCలో ఇంకా చికిత్స పొందుతున్న.. 20 మందికి పైగా బాధితులను పరామర్శించిన పవన్.. వారి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కున్నారు. వారికి అందుతున్న వైద్యసదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి ఎలా వ్యాప్తి చెందింది.. దానికి గల కారణాలపై అధికారులను ఆరా తీశారు. గ్రామంలో శానిటేషన్ ఎలా ఉందో పరిశీలించారు. SSR పేటలో ఉన్న తాగునీటి పథకాన్ని పవన్ పరిశీలించారు. ఏకంగా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి గ్రామానికి అందుతున్న నీటిని స్వయంగా చెక్ చేశారు. అతిసారాన్ని కంట్రోల్ చేయడానికి ఏఏ చర్యలు తీసుకున్నారన్నదానిపై విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో RWS, హెల్త్‌, పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు పవన్. ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి దిశానిర్దేశం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్మార్ట్ ఇన్సులిన్.. ఇక డయాబెటీస్ బెంగ తీరినట్టేనా ??

సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో !!

హౌస్‌లో ఏడు వారాలు.. అందులో ఏడుపులు !! కానీ రెమ్యునరేషన్‌ భారీగానే గుంజాడుగా

Bigg Boss Manikanta: అదృష్టాన్ని కాలదన్నుకున్న దురదృష్టవంతుడు

Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌ పిటిషన్‌..