కాటేసిన పాముతోనే ఆసుపత్రికి.. ఆ తర్వాత ??
ఓ వ్యక్తి ఏకంగా తనను కాటేసిన పామును చేతపట్టుకొని చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అతని చేతిలో పామును చూసి ఆస్పత్రి సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆపామును వదిలిపెట్టాలని చెప్పారు. అయితే అతను మాత్రం పామును వదల్లేదు సరికదా.. ఆ పామును అలాగే గట్టిగా పట్టుకొని ఆ పాము తనను కాటేసిందని, తనకు వెంటనే చికిత్స చేయాలని కోరాడు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.
బీహార్‌లోని భగల్‌పూర్‌కు చెందిన ప్రకాశ్ మండల్ అనే వ్యక్తి ప్రమాదకరమైన విషసర్పాన్ని నోటితో పట్టుకుని మెడకు చుట్టుకుని ఆస్పత్రికి వెళ్ళాడు. అతన్ని చూసి అందరూ నోరెళ్లబెట్టారు. తనను ఆ పాము కాటువేసిందని, ఎమర్జెన్సీ వార్డులో అత్యవసరంగా చికిత్స అందించాలని కోరాడు. అతని తీరుకు అక్కడున్న రోగులే కాదు, వైద్యులు, సిబ్బందికూడా షాకయ్యారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పామును వదిలిపెట్టాలని వైద్యులు, అక్కడ ఉన్నవారు ప్రకాశ్ మండల్‌కు ఎంత చెప్పినా అతను వినిపించుకోలేదు. అలాగే తనకు చికిత్స అందించాలని కోరాడు. అది తనతోనే ఉండాలని చెప్పాడు. అతను ఆ పామును చేత్తో అలాగే గట్టిగా పట్టుకొని నేలపై పడుకొని చిత్ర విచిత్రంగా ప్రవర్తించాడు. చేసేది లేక వైద్య సిబ్బంది అతన్ని స్ట్రెచ్చర్‌పై చికిత్సకోసం తరలించారు. అయితే వైద్యులు మాత్రం పామును వదిలితేనే చికిత్స చేస్తామని చెప్పడంతో చివరకు పామును విడిచిపెట్టాడు. ప్రస్తుతం ప్రకాశ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అతన్ని కాటు వేసిన ఆ పాము రస్సెల్స్ వైపర్ అనే అత్యంత విషపూరితమైన పాము అని తెలిపారు. ఇది ఇండియా, తైవాన్, జావాలలో తరచూగా కనిపిస్తుంది. ఎక్కువగా వ్యవసాయ భూముల్లో ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుర్లలో ఏం జరిగింది ?? డయేరియా వ్యాప్తి వెనుక నిజాలు ఏంటి ??
స్మార్ట్ ఇన్సులిన్.. ఇక డయాబెటీస్ బెంగ తీరినట్టేనా ??
సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో !!
హౌస్‌లో ఏడు వారాలు.. అందులో ఏడుపులు !! కానీ రెమ్యునరేషన్ భారీగానే గుంజాడుగా
Bigg Boss Manikanta: అదృష్టాన్ని కాలదన్నుకున్న దురదృష్టవంతుడు