Bigg Boss Manikanta: అదృష్టాన్ని కాలదన్నుకున్న దురదృష్టవంతుడు
బిగ్‌బాస్ షో నుంచి నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అది కూడా సెల్ఫ్ గోల్ వేసుకుని మరీ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. షో ప్రారంభంలో తన భార్య, బిడ్డల కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానంటూ, వారి కోసమైనా బిగ్ బాస్ టైటిల్ గెలుస్తానంటూ ప్రగల్భాల పలికాడు మణికంఠ. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెబుతూ తెగ ఎమోషనల్ అయ్యాడు. చీటికీ మాటకీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ స్టార్, సింపతీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.
తన ఏడుపుతో.. హౌస్ లోని కంటెస్టెంట్స్ తో పాటు ఆడియెన్స్ కు కూడా చిర్రాకు తెప్పించింది. ఇక ఎవరైనా తనను నామినేట్ చేస్తే చాలు.. ఆ వారమంతా తెగ టెన్షన్ పడిపోయేవాడు. తను హౌస్‌లోనే ఉండాలని తెగ పరితపించేవాడు. అలాంటి మణికంఠకు ఏమైందో ఏమో కానీ.. ఇక హౌస్ లో ఉండలేనన్నాడు. ఇంటికి వెళ్లిపోతానంటూ తెగ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆరోగ్యం బాగోలేదు.. తన మైండ్ పని చేయట్లేదు.. బాడీ సహకరించట్లేదు.. బయటకు పంపించండి మహా ప్రభో అంటూ బిగ్ బాస్ ను వేడుకున్నాడు. నాగ మణికంఠ పరిస్థితిని అర్థం చేసుకుని డాక్టర్ దగ్గరకు కూడా పంపించగా వాళ్లు బాగానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అయినా సరే హౌస్‌లో సర్దుకోలేకపోయాడు మణికంఠ. దీంతో చేసేదేం లేక.. అతడు కోరుకున్నట్లుగానే నాగార్జున బయటకు పంపించేశారు. ఎలిమినేట్ చేశారు. దీంతో మణికంఠ తీరుపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. అదృష్టాన్ని కాలదన్నుకున్న దురదుష్టవంతుడు కామెంట్ నెట్టింట కనిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..
బన్నీ కోసం రంగంలోకి స్త్రీ2 హీరోయిన్.. ఇక నార్త్ షేక్ అవడం పక్కా.. అంతే
శోభిత ఇంట..పెళ్లి పనులు మొదలయ్యాయి..
TOP 9 ET News: రామ్ చరణ్ పాటకు కొరియన్ స్టార్ట్స్ క్రేజీ డ్యాన్స్