శోభిత ఇంట..పెళ్లి పనులు మొదలయ్యాయి..

శోభిత ఇంట..పెళ్లి పనులు మొదలయ్యాయి..

Phani CH

|

Updated on: Oct 22, 2024 | 12:53 PM

అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న శోభిత ధూళిపాళ కుటుంబం పెళ్లి పనులు మొదలుపెట్టింది. తాజాగా శోభిత పెళ్లికి సంబంధించి.. గోధుమరాయి, పసుపు దంచే ఫంక్షన్‌.. వైజాగ్‌లోని తన ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది. పసుపు కొట్టే కార్యక్రమంలో ట్రెడిషనల్ లుక్​తో ఆరెంజ్, గ్రీన్ అంచు శారీలో పసుపు దంచుతూ.. శోభితా కనిపించింది. శోభిత మాత్రమే కాదు.. శోభిత ఫ్యామిలీ, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను శోభిత తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. గోధుమరాయి, పసుపు దంచడం.. పనులు మొదలయ్యాయి అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు కూడా.. పసుపు కొట్టారు అంటే పెళ్లి పనులు మొదలయినట్టే. దీంతో త్వరలోనే శోభిత – నాగచైతన్య పెళ్లి ఉండబోతుంది అని అప్పుడే నెట్టింట ఫ్యాన్స్ పోస్టులు మొదలయ్యాయి. పెళ్లి డేట్ ఎప్పుడనే ఆరాలు కూడా.. ఎక్కువయ్యాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: రామ్ చరణ్‌ పాటకు కొరియన్ స్టార్ట్స్ క్రేజీ డ్యాన్స్

పశువుల పాకలోకి వెళ్లిన యజమాని.. అక్కడ సీన్‌ చూసి షాక్‌

మీకు ఓటేశాను.. నాకు పెళ్లి చేయండి.. ఓటరు చేతిలో ఎమ్మెల్యేకు ఊహించని అనుభవం

ఇంత చిన్న వాషింగ్ మెషీన్ మీరెప్పుడూ చూసి ఉండరు

యూట్యూబ్‌లో స్లీప్‌ టైమర్‌ ఆప్షన్‌.. ఎలా పనిచేస్తుందంటే ??

Published on: Oct 22, 2024 11:58 AM