పశువుల పాకలోకి వెళ్లిన యజమాని.. అక్కడ సీన్ చూసి షాక్
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, కాల్వలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. పంటపొలాలు, రహదారులు, గ్రామాలు నీటమునుగుతున్నాయి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. దీంతో పాములు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. దాంతో ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడ చూసినా పాములు, కొండచిలువలు దర్శనమిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
తాజాగా మంచిర్యాల జిల్లాలో ఓ ఇంటి సమీపంలో కొండచిలువ కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అదిల్ పేట్ గ్రామంలో కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన శివ అనేవ్యక్తి ఇంటికి సమీపంలో పశువుల కొట్టం ఉంది. ఎప్పటిలాగే అందులో పశువులు, మేకలను కట్టేశారు. ఎప్పుడు చొరబడిందో ఏమో కానీ ఓ పెద్ద కొండచిలువ పశువుల కొట్టంలోకి ప్రవేశించింది. అక్కడ ఓ మేకపిల్లను మింగేసి కదలకుండా అక్కడే పడుకుని ఉంది. ఇంతలో పశువుల కొట్టంవైపు వచ్చిన యజమాని కొండచిలువను చూసి షాకయ్యాడు. తీవ్ర భయాందోళకు గురైన అతను స్థానికులకు విషయం చెప్పాడు. స్థానికులు అక్కడకు చేరుకొని కొండచిలువను కొట్టి చంపేశారు. అయితే స్నేక్ క్యాచర్‌కి సమాచారం ఇచ్చి కొండ చిలువను చంపకుండా ఉండాల్సిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీకు ఓటేశాను.. నాకు పెళ్లి చేయండి.. ఓటరు చేతిలో ఎమ్మెల్యేకు ఊహించని అనుభవం
ఇంత చిన్న వాషింగ్ మెషీన్ మీరెప్పుడూ చూసి ఉండరు
యూట్యూబ్‌లో స్లీప్ టైమర్ ఆప్షన్.. ఎలా పనిచేస్తుందంటే ??
Blinkit: బ్లింక్ ఇట్ ఐడియా అదిరిపోయిందిగా !!
చాట్‌జీపీటీ సాయంతో సీవీ.. చూసి షాకైన సీఈఓ
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

