Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..
సిని హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసు విషయంలో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని అల్లు అర్జున్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్ట్ స్వీకరించింది. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో ఎన్నిల ప్రచారంలో పాల్గొన్నారు.
ఆ సమయంలో షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ నంద్యాలకు వచ్చిన బన్నీ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలిచిన తన మిత్రుడు శిల్పా రవి ఇంటికి వెళ్లారు. సుమారు గంటన్నరకు పైగా అక్కడే శిల్పా రవి ఇంట్లోనే గడిపారు. కాసేపు మీడియాతో మాట్లాడి తిరుపతికి వెళ్లిపోయారు. అయితే ఈ సమయంలో బన్నీని చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. రవి ఇంటి ముదు పెద్ద హంగామా చేశారు. అల్లు అర్జున్ శిల్పారవి ఇంటికి వచ్చింది వ్యక్తిగతమైనా.. భారీగా ఫ్యాన్స్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జనసమీకరణ చేపట్టారంటూ నంద్యాల పోలీసులు బన్నీతోపాటు శిల్పా రవిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 188 కింద కేసు బుక్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బన్నీ కోసం రంగంలోకి స్త్రీ2 హీరోయిన్.. ఇక నార్త్ షేక్ అవడం పక్కా.. అంతే
శోభిత ఇంట..పెళ్లి పనులు మొదలయ్యాయి..
TOP 9 ET News: రామ్ చరణ్ పాటకు కొరియన్ స్టార్ట్స్ క్రేజీ డ్యాన్స్
పశువుల పాకలోకి వెళ్లిన యజమాని.. అక్కడ సీన్ చూసి షాక్
మీకు ఓటేశాను.. నాకు పెళ్లి చేయండి.. ఓటరు చేతిలో ఎమ్మెల్యేకు ఊహించని అనుభవం