- Telugu News Photo Gallery Massaging children with oil? These things are for you, Check Here is Details
Baby Oil Massage: చిన్న పిల్లలకు ఆయిల్‌తో మసాజ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
చిన్న పిల్లలు ఎంతో సున్నితంగా ఉంటారు. వీరిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. వీళ్ల సంరక్షణ ఎంతో బాధ్యతతో కూడుకున్నది. కనీసం మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు వారిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ముఖ్యంగా స్నానం చేయించేటప్పుడు, ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు సున్నితంగా వ్యవహరించాలి. శిశువులకు ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల వారికి చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఒత్తిడి అనేది చాలా వరకు తగ్గుతుంది. శరీరంలోని కండరాలు మొత్తం..
Updated on: Oct 22, 2024 | 5:15 PM

చిన్న పిల్లలు ఎంతో సున్నితంగా ఉంటారు. వీరిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. వీళ్ల సంరక్షణ ఎంతో బాధ్యతతో కూడుకున్నది. కనీసం మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు వారిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ముఖ్యంగా స్నానం చేయించేటప్పుడు, ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు సున్నితంగా వ్యవహరించాలి.

శిశువులకు ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల వారికి చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఒత్తిడి అనేది చాలా వరకు తగ్గుతుంది. శరీరంలోని కండరాలు మొత్తం రిలాక్స్ అవుతాయి. ఎముకులు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కణజాల అభివృద్ధికి చక్కగా ఉంటుంది.

పిల్లలకు కొబ్బరి నూనె, నువ్వుల నూనె, వెన్న, నెయ్యి, ఆలివ్ నూనె, బాదం నూనె, ఆవాల ఆయిల్ ఇలా పలు రకాల ఆయిల్స్‌తో మసాజ్ చేస్తారు. వేటితో చేసినా అందుకు సంబంధించిన ప్రయోజనాలు చక్కగా అందుతాయి.

చాలా మంది పిల్లలకు గట్టి పడాలని శరీరాన్ని గట్టి ప్రెస్ చేస్తారు. ఇది చాలా తప్పు. చాలా సున్నితంగా కండరాలకు పట్టేలా ఆయిల్ మసాజ్ చేయాలి. ఆయిల్ మసాజ్ చేయడం వల్ల పిల్లల్లో రక్త ప్రసరణ మెరుగు పడి.. శరీర భాగాలు చక్కగా పని చేస్తాయి.

మసాజ్ చేయడం వల్ల పిల్లల్లో నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. అలసట, నీరసం దూరం అవుతాయి. ఎముకలు గట్టి పడి బలంగా మారతారు. శరీరంలో ఆక్సిజన్ సరఫరగా చక్కగా ఉంటుంది. మలబద్ధకం, శ్వాస సమస్యలు, గ్యాస్, ఉబ్బరం వంటివి కంట్రోల్ అవుతాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)




