- Telugu News Photo Gallery Business photos Unique scooters under a lakh, These are the best scooters, Best scooters under 1 lakh details in telugu
Best scooters: లక్షలోపు లక్షణమైన స్కూటర్లు.. ది బెస్ట్ స్కూటర్లు ఇవే..!
దేశంలో అత్యధికంగా ఉన్న సామాన్య, మధ్య తరగతి ప్రజలందరి ముఖ్య ప్రయాణం సాధనం ద్విచక్ర వాహనం. నేడు ప్రతి కుటుంబంలో ఇది అంతర్బాగమైంది. పట్టణాలలో శివారు ప్రాంతాలకు జనాభా విస్తరించడం, బస్టాండ్ లు నివాసాలకు దూరంగా ఉండడం, వేగంగా పనులు చేసుకోవడం తదితర కారణాలతో ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మోటారు సైకిళ్ల కన్నా స్కూటర్ల కొనుగోలు పెరిగింది. నగరాల్లోని ట్రాఫిక్ రద్దీలో గేర్ మార్చే పని లేకుండా సులువు ప్రయాణించడం, మహిళలు కూడా వినియోగించుకునేందుకు వీలుగా ఉండడం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఫీచర్లు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ.లక్ష ధరలోపు స్కూటర్లు మార్కెట్ లో ఉన్నాయి. మంచి స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా ఈ అంశాలను బాగా గమనించాలి.
Updated on: Oct 22, 2024 | 4:45 PM

ఓలా ఎస్ 1 ఎక్స్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు బాగున్నాయి. చాలామంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారికి ఓలా ఎస్ 1 ఎక్స్ చాలా బాగుంటుంది. దీనిలోని ఎలక్ట్రిక్ మోటారు 8 హెచ్ పీని ఉత్పత్త చేస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేసుకుంటే 95 నుంచి 193 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయవచ్చు. ఓలా ఎస్ 1 ఎక్స్ స్కూటర్ ధర రూ.74,999 నుంచి రూ.89,999 వరకూ ఉంది.

హోండా యాక్టివా 125 ప్రజల అభిమానాన్ని పొందిన ప్రముఖ బ్రాండ్ స్కూటర్ ఇది. దీని ధర రూ.80,265 (ఎక్స్ ఫోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ స్పెక్ వేరియంట్ కావాలంటే రూ.89,429 వరకూ ఖర్చుచేయాలి. హోండా యాక్టివాలో 124 సీసీ సింగిల్ సిలిండర్ అమర్చారు. దీని నుంచి 8.19 హెచ్ పీ, 10.4 ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది. లీటర్ పెట్రోలుకు 51.23 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

యమహా రే జెడ్ఆర్ సామాన్యుడికి అందుబాటులో ఉన్న హైబ్రిడ్ స్కూటర్ ఇది. దీనిలోని 125 సీసీ సింగిల్ సిలిండర్ నుంచి 8.04 హెచ్ పీ, 10.3 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ఆన్ బోర్డు బ్యాటరీని చార్జింగ్ చేయడానికి ఎస్ఎంజీ ఉపయోగపడుతుంది. బ్యాటరీ నుంచి ఇంజిన్ కు సాయం అందుతుంది. కంపెనీ లెక్కల ప్రకారం 49 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ప్రారంభ ధర రూ.85,030, కాగా.. టాప్ స్పెక్ వేరియంట్ రూ.91.930 వరకూ పలుకుతోంది.

సుజుకి యాక్సెస్ స్కూటర్ 45 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 124 సీసీ సింగిల్ సింగిల్ సిలిండర్ ఆధారంగా పనిచేస్తుంది. 8.6 హెచ్ పీ, 10 ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది. ఇంజిన్ సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కు ఆటోమేటిక్ గా హుక్ అవుతుంది. ఈ స్కూటర్ ధర రూ.85,601 నుంచి 91.300 వరకూ ఉంది.

టీవీఎస్ జూపిటర్ 125 దేశంలో ఎక్కువ మంది ప్రజలు వినియోగిస్తున్న స్కూటర్లలో టీవీఎస్ జూపీటర్ ఒకటి. దీనిలో 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. 8.04 హెచ్ పీ, 10.5 ఎన్ఎం గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ స్కూటర్ 50 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. టీవీఎస్ జూపిటర్ 125 ప్రారంభ ధర రూ.73,700 (ఎక్స్ షోరూమ్) కాగా, డిస్క్ బ్రేక్ లతో కూడిన టాప్ స్పెక్ ట్రిమ్ ధర రూ.87,250 వరకూ ఉంది.




