- Telugu News Photo Gallery Business photos Google Pixel 9 pro XL gets flat 10000 rupees offer on Flipkart
Google Pixel 9 Pro XL: ఫ్లిప్‌కార్ట్ దీపావళి ఆఫర్లు.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.10,000 తగ్గింపు..!
ఫ్లిప్‌కార్ట్‌లో దీవాళి సేల్ కొనసాగుతోంది. ఇది వరకు బిగ్‌బిలియన్ డేస్ సేల్ కొనసాగగా, ఇప్పుడు దీపావళి సేల్ ప్రారంభమైపోయింది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్‌లపై భారీ ఆఫర్లు ఉన్నాయి.
Updated on: Oct 21, 2024 | 9:20 PM

దీపావళి పండుగ అక్టోబర్ 31న జరుపుకోనుండగా, ఫ్లిప్‌కార్ట్ తన దీపావళి సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.

Flipkart దీపావళి సేల్ Google Pixel 9 Pro XL స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10,000 వరకు తగ్గింపును అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను రూ. 1,24,999కి విడుదల చేయగా, ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.1,14,999కి విక్రయిస్తున్నారు. అంతే కాకుండా బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను వినియోగించి ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే మరింత ధర తగ్గే అవకాశం ఉంది.

Google Pixel 9 Pro XL స్మార్ట్‌ఫోన్‌లో 6.8-అంగుళాల సూపర్ అక్యూటా డిస్‌ప్లే ఉండగా, స్మార్ట్‌ఫోన్ సుమారు 3,000 నిట్‌ల బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఇది సూర్యకాంతిలో కూడా మొబైల్ ఫోన్‌ను సులభంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది.

స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 5X ఆప్టికల్ జూమ్ ఫీచర్‌తో కూడిన 48-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

ఇందులో అమర్చిన ఈ 42 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫోటోలు స్పష్టంగా తీయడానికి మీకు సహాయం చేస్తుంది. Google Pixel 9 Pro XL ప్రస్తుతం మార్కెట్లో అత్యుత్తమ కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్.




