- Telugu News Photo Gallery Business photos Huge discount on Bluetooth speakers, Bumper offers on Amazon, Amazon sale bluetooth speakers details in telugu
Amazon sale: బ్లూటూత్ స్పీకర్లపై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్లు షురూ..!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మంచి జోష్ తో కొనసాగుతోంది. ఎలక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్ వరకూ అన్ని రకాల వస్తువులను అందుబాటులో ఉంచారు. అది కూడా భారీ డిస్కౌంట్ ధరలలో విక్రయిస్తున్నారు. దీపావళి సందర్భంగా షాపింగ్ చేయలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ నేపథ్యంలో అత్యుత్తమ బ్లూటూత్ స్పీకర్లను అతి తక్కువ ధరకే అందిస్తున్నారు. పార్టీలు చేసుకునే సమయంలో, ఇంటిలో టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు మంచి సౌండ్ కోరుకునే వారికి ఉపయోగంగా ఉంటాయి. అలాగే ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై పది శాతం వరకూ తక్షణ క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.
Updated on: Oct 21, 2024 | 4:46 PM

ప్రీమియం క్వాడ్రాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన ఫిలిప్స్ స్పీకర్ నుంచి ధ్వని చాలా స్పష్టంగా వెలువడుతుంది. ఇది వాటర్ ఫ్రూప్ కావడంతో చాలా ఉపయోగంగా ఉంటుంది. 5 వ్యాట్ల అవుట్ పుట్, యూఎస్ బీ 1 పోర్టు, ఎంబోస్ట్ బటన్, ప్లే బ్యాక్ స్లీరియో జత చేసుకోవడం, బ్లూటూత్ నియంత్రణ తదితర ఫీచర్లు ఉన్నాయి. 1.75 అంగుళాల పూర్తి శ్రేణి డ్రైవర్, పాసివ్ రేడియేటర్లు మంచి సౌండ్ ట్రాక్ ను అందిస్తాయి. ఫిలిప్ ఆడియో స్టోర్ ఎస్3505 బ్లూటూత్ స్పీకర్ రూ.4,310కి అందుబాటులో ఉంది.

జేవైఎక్స్ ఇండోర్, అవుట్ డోర్ లో పార్టీలు జరిగినప్పడు చాాలా ఉపయోగపడుతుంది. దీనిలో 8500 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ కు ఇబ్బంది ఉండదు. 8 రంగుల డిస్కో లైటింగ్ మోడ్ అదరపు ఆకర్షణ. బ్లూటూత్ స్పీకర్ రిచ్ బాస్, క్రిస్టల్ క్లియర్ ట్రెబుల్ తో 100 డబ్ల్యూ అవుట్ పుట్, డ్యూయల్ 20 డబ్ల్యూ సబ్ వూఫర్ డ్రైవర్ ఆకట్టుకుంటున్నాయి. వివిధ పరికరాలను త్వరగా కనెక్ట్ చేసుకోవచ్చు. జేవీఎక్స్ వైర్ లెస్ బోట్ బ్లూ టూత్ స్పీకర్ ను అమెజాన్ లో 7,749కి కొనుగోలు చేసుకోవచ్చు.

నాన్ స్టాప్ వినోదం పొందాలనుకునేవారికి ట్రిబిట్ బ్లూటూత్ స్పీకర్ బాగుంటుంది. దీనిలోని 2*5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 24 గంటల పాటు చక్కగా పనిచేస్తుంది. ఎక్స్ బాస్ టెక్నాలజీ తో అత్యుత్తమ ఆడియో విడుదలవుతుంది. ట్యాబ్లెట్, స్మార్ట్ ఫోన్లకు బాాగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంటిలో ఉపయోగించుకోవడానికి మంచి బ్లూటూత్ స్పీకర్ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి ఎంపిక. ట్రిబిట్ అప్ గ్రేడ్ వెర్షన్ స్మార్ట్ బ్యాక్స్ పో బ్లూ టూత్ స్పీకర్ ను అమెజాన్ లో రూ.7,969కి కొనుగోలు చేసుకోవచ్చు.

అకాయ్ స్పీకర్ సినిమాలు చూస్తున్నా, సంగీతం వింటున్నా, ఇతర కార్యక్రమాలు చూస్తున్నా శ్రావ్యమైన ధ్వనిని విడుదల చేస్తుంది. అకాయ్ యూబీ 80 బ్లూటూత్ స్పీకర్ 80 డబ్ల్యూ ఆర్ఎంఎస్ అవుట్ పుట్ విడుదల చేస్తుంది. దీనిలోని బ్లూటూత్ 5.0తో మీ ఫోన్, ట్యాబ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. హెచ్ డీఎంఐ ఏఆర్సీ సపోర్టుతో మంచి ఆడియో అనుభవం కలుగుతుంది. యూఎస్బీ, ఎఫ్ఎం రేడియా, యాక్స్, వైర్డు మైక్రో ఫోన్ ఇన్ పుట్ తో అనేక రకాల ప్లే బ్యాక్ ఎంపికలు ఉన్నాయి. మైక్ హై బాస్ సౌండ్ తో లభించే అకాయ్ బ్లూటూత్ స్పీకర్ రూ.6,490కి అందుబాటులో ఉంది.

ట్రోనికా ట్విన్ టవర్ స్వష్టమైన ఆడియోతో ఇంటిలోనే మంచి సంగీతానుభవాన్ని ఆస్వాదించవచ్చు. క్లీన్, డీప్, కంట్రోల్డ్ మిశ్రమంగా మంచి పనితీరును అందిస్తాయి. 80 డబ్ల్యూ 5.25 వూఫర్లతో ఆకట్టుకునేలా ధ్వనిని విడుదల చేస్తాయి. 100 ఎంఎం మందపాటి ఫ్రంట్ బ్యాఫిల్ చాంఫెర్డ్ , ఇంటిగ్రేడెట్ వేవ్ గైట్ డైనమిక్ సౌండ్, ఫ్రంట్ ఫైరింగ్ ట్యూబ్ పోర్ట్ అదనపు ప్రత్యేకతలు. ట్రోనికా ట్విన్ టవర్ 80 డబ్ల్యూ బ్లూ టూత్ పార్టీ స్పీకర్ ను అమెజాన్ లో రూ.4,141కి కొనుగోలు చేసుకోవచ్చు.




