- Telugu News Photo Gallery Business photos Give these items as Diwali gifts Take a look on croma offers, Croma sale offers details in telugu
Croma sale offers: దీపావళి బహుమతులుగా వీటిని ఇస్తే అదుర్స్… మీరూ ఓ లుక్కేయ్యండి
వెలుగుల పండగ దీపావళి త్వరలో రాబోతోంది. పండగను ఆనందంగా జరుపుకోవడానికి అందరూ వివిధ ప్రణాళికలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా అతిథులకు ఏ బహుమతులు ఇవ్వాలనే విషయంపై తర్జనభర్జన పడుతుంటారు. సాధారణంగా అలంకరణ వస్తువులను బహుమతిగా ఇవ్వాలని భావిస్తారు. కానీ అతిథులకు ఉపయోగపడే వస్తువులు ఇచ్చే చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలో క్రోమా ఆన్ లైన్ విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ సేల్ లో అతి తక్కువ ధరలకే ఇంట్లో ఉపయోగపడే వస్తువులను అందుబాటులోకి తీసుకువచ్చారు. పార్టీ స్పీకర్, టీవీ, శాండ్ విచ్ మేకర్, మైక్రో ఓవెన్, సౌండ్ బార్ తదితర వాటిని భారీ డిస్కౌంట్ పై విక్రయిస్తున్నారు.
Updated on: Oct 21, 2024 | 3:35 PM

క్రోమా రెడీ గూగుల్ టీవీ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్, ఎల్ఈడీ డిస్ ప్లే తో క్రోమా గూగుల్ టీవీ ఆకట్టుకుంటోంది. కేవలం వాయిస్ తోనే చానల్ మార్చుకోవచ్చు. సౌండ్ పెంచుకోవచ్చు. దీనిలో వివిధ రకాల ఇన్ బిల్డ్ ఫీచర్లు ఉన్నాయి. మంచి రిజల్యూషన్, హెచ్ డీ రెడీ డిస్ ప్లే కారణంగా స్పష్టమైన విజువల్స్ చూడవచ్చు. డాల్బీ ఆడియో మోడ్ తో థియటర్ లో ఉన్న అనుభవం కలుగుతుంది. అదనపు పరికరాలను కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియా, హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్ లను యాక్సెస్ చేయవచ్చు. క్రోమా 32 అంగుళాల రెడీ గూగుల్ టీవీ ధర రూ.9,990 మాత్రమే.

క్రోమా బ్లూటూత్ పార్టీ స్పీకర్ ఇంటిలో గానీ, బయట గానీ పార్జీలు జరినప్పుడు మంచి సౌండ్ తో పాటలు వినడానికి క్రోమా బ్లూటూత్ పార్టీ స్పీకర్ఉపయోగపడుతుంది. దీనిలోని 50 డబ్ల్యూ పవర్ అవుట్ పుడ్, వైర్డు మైక్ కారణంగా ఆడియో చాలా స్పష్టంగా విడుదల అవుతుంది. బ్లూటూత్ 5.0 కనెక్టివీటితో అంతరాయం లేకుండా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. 5 ఈక్యూ మోడ్ తో పలు రకాల సెట్టింగ్ లను మార్చుకోవచ్చు. క్రోమా బ్ల్యూటూత్ స్పీకర్ 55 శాతం భారీ డిస్కౌంట్ పై రూ.4,490 ధరకు అందుబాటులో ఉంది.

క్రోమా మైక్రో ఓవెన్ చిన్న కుటుంబానికి క్రోమా 20 లీ సోలో మైక్రో ఓవెన్ చక్కగా సరిపోతుంది. దీనిలోని హీట్ సెన్సార్ తో ఆహారాన్ని కచ్చితమైన నియంత్రణతో వేడి చేయవచ్చు. వివిధ అవసరాల కోసం దీనిలో 5 పవర్ సెట్టింగ్ లు ఉన్నాయి. ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ టెక్నాలజీ అదనపు ప్రత్యేకత. మిగిలిన ఆహారాన్ని వేడిచేసుకోవడానికి, ఉడికించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. 20 లీటర్ల సామర్థ్యం గల క్రోమా 20 లీ సోలో మైక్రో ఓవెన్ ను 20 శాతం తగ్గింపుపై రూ.4,790కి కొనుగోలు చేసుకోవచ్చు.

క్రోమా శాండ్ విచ్ మేకర్ శాండ్ విచ్ లంటే పిల్లల నుంచి పెద్దలందరికీ ఇష్టమే. వీటిని తయారుచేసుకునే శాండ్ విచ్ మేకర్ అందరికీ ఉపయోగమే. క్రోమా 4 స్లైస్ శాండ్ విచ్ మేకర్ 35 శాతం తగ్గింపుపై 1,299కి అందుబాటులో ఉంది. నాన్ స్టిక్ కోటెడ్ ప్లేట్లు, ఆటోమెటిక్ ఆపరేషన్, ఎల్ఈడీ లైట్లు తదితర ఫీచర్లు ఉన్నాయి. తక్కు వ నూనెను ఉపయోగించి రుచికరమైన శాండ్ విచ్ లతో పాటు పాన్ కేక్ లు, క్రీప్స్ తదితర వాటిని తయారు చేసుకోవచ్చు.

క్రోమా బ్లూటూత్ సౌండ్ బార్ ఆకట్టుకునే డిజైన్, బ్లూటూత్ కనెక్టివిటీ, రిమోట్ తో కూడిన క్రోమా సౌండ్ బార్ ను దీపావళికి బహుమతిగా ఇవ్వవచ్చు. దీనిలోని 60 డబ్ల్యూ సౌండ్ అవుట్ పుట్, 2.0 సరౌండ్ సౌండ్ తో ఆడియోను చాలా స్పష్టంగా వినవచ్చు. ఈక్యూ మోడ్ ల కారణంగా కంటెంట్ కు అనుగుణంగా ధ్వని విడుదలవుతుంది. టీవీతో పాటు స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, పీఎస్ 5 కు సులభంగా కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. క్రోమా సౌండ్ బార్ రూ.3,999కి అందుబాటులో ఉంది.




