జైళ్లను అద్దెకు ఇచ్చే యోచనలో సర్కార్..!

TV9 Telugu

25 August 2024

ఈ దేశంలో చాల కాలంగా ఒక్క నేరం కూడా జరలేదు. దీంతో ఇక్కడ జైలును రెస్టారెంట్‌గా మార్చారు ప్రభుత్వ అధికారులు.

ఇటీవలి కాలంలో నెదర్లాండ్స్‌లో నేరాల రేటు భారీగా తగ్గింది. దీంతో దేశంలోని జైళ్లు దాదాపు ఖాళీ అయ్యాయి.

నెదర్లాండ్స్ జైళ్లలో నేరస్థులు లేరని, నేరాల సంఘటనలు అక్కడ గణనీయంగా తగ్గాయని గణాంకాలు చూపిస్తున్నాయి.

దేశంలో నేరస్తులు లేరని, దీని వల్ల ఖైదీలను జైళ్లలో ఉంచాల్సిన అవసరం లేదని అంటున్నారు అక్కడి అధికారులు.

ఖైదీల కొరత ఉన్న కారణంగా, నెదర్లాండ్స్ ప్రభుత్వం కొన్ని జైళ్లను రెస్టారెంట్లుగా మార్చాలని నిర్ణయించింది.

ఇప్పుడు నెదర్లాండ్స్ జైళ్లలో పెద్ద పెద్ద రెస్టారెంట్లు తెరవబడ్డాయి. జైలు పరిపాలన వాటిని నిర్వహిస్తోంది.

దీంతో పాటు జైళ్లను కూడా అద్దెకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. నెదర్లాండ్స్ జైళ్లు చాలా అధునాతనమైనవి.

ఇక్కడ ఖైదీలకు ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి. తద్వారా వారు తమ కుటుంబాలతో కనెక్ట్ అయి ఉంటారు.