పొడవైన మెడతో పర్యాటక ఆకర్షణగా మారిన మహిళలు 

17 August 2024

TV9 Telugu

ప్రపంచంలోనే అతి పొడవైన మెడలు కలిగిన మహిళలు ఆ దేశంలో ఉన్నారు. వీరు తమ దేశానికి పర్యటనకు ప్రధాన ఆకర్షణకు కేంద్రంగా మారారు. 

మెడతో అందం

స్త్రీ అందాన్ని, గుణగాణాల గురించి ప్రసంసిస్తూ రాసిన పాటల్లో, కథల్లో పొడవైన మెడ ప్రస్తావన చాలా ఉంది. అంటే పొడవాటి మెడ మహిళల అందంలో ప్లస్ పాయింట్‌గా పరిగణించబడుతుంది.

పొడవైన మెడ

ఫ్లూటెడ్ నెక్ గురించి వినే ఉంటారు. మెడ సుందరంగా, ప్రత్యేకంగా కనిపించే స్త్రీలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో తెలుసా ?

పొడవాటి మెడ ఉన్న మహిళలు

పొడవైన మెడలు కలిగిన స్త్రీలు థాయ్‌లాండ్‌లోని కయాన్‌ తెగకు చెందిన చెందినవారు. ఈ తెగ స్త్రీలు ధరించే దుస్తులు కూడా చూడటానికి చాలా భిన్నంగా ఉంటాయి.

మెడ చుట్టూ ఉంగరాలు  

అంతేకాదు అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తున్న ఈ జాతి స్త్రీలు ప్రపంచంలో చాలా భిన్నంగా కనిపిస్తారు. బాలికల నుంచి వృద్ధుల వరకు మెడలో ఉంగరాలు ధరించి దర్శనమిస్తారు. 

అందంగా భావిస్తారు

నిజానికి ఇక్కడ మెడ పొడవు, మరింత అందంగా పరిగణించబడుతుంది. అందుకనే ఐదేళ్ళ వయసు నుంచే మెడలో ఇత్తడి ఉంగరాలను ధరించడం మొదలు పెడతారు. 

ఏ వయసు నుంచి అంటే 

ఇక్కడ వయస్సుతో పాటు ధరించే ఉంగరాల సంఖ్య పెరుగుతుంది. 25 ఉంగరాలు ధరించే స్త్రీలు చాలా అందంగా పరిగణించబడతారు.అయితే కొందరు మహిళలు 28 నుంచి 29 వరకు ధరిస్తారు.

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

ఈ తెగ మహిళలు ధరించే దుస్తులు, సంస్కృతి కారణంగా ఈ ప్రదేశం ఆ దేశవ్యాప్తంగానే కాదు విదేశాలలో గుర్తింపు పొందారు. పర్యాటకులను ఆకర్షిస్తారు. 

విదేశాలలో గుర్తింపు