- Telugu News Photo Gallery If you do this asana when you wake up in the morning, whole body will be clean, Check Here is Details
Malasana: ఉదయం లేవగానే ఈ ఒక్క ఆసనం వేశారంటే.. బాడీ మొత్తం శుభ్రం..
యోగా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. యోగాతో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తగ్గించుకోవచ్చు. తరచూ యోగా చేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు. శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో యోగా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఉదయం లేచిన తర్వాత వ్యాయామం చేయడానికి ఎవరికీ సమయం లేనప్పుడు.. ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు. అదే మలాసనం. అధిక బరువు, ఊబకాయం తగ్గి ఫిట్‌గా..
Updated on: Oct 22, 2024 | 6:50 PM

యోగా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. యోగాతో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తగ్గించుకోవచ్చు. తరచూ యోగా చేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు. శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో యోగా ముఖ్య పాత్ర వహిస్తుంది.

ఉదయం లేచిన తర్వాత వ్యాయామం చేయడానికి ఎవరికీ సమయం లేనప్పుడు.. ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు. అదే మలాసనం. అధిక బరువు, ఊబకాయం తగ్గి ఫిట్‌గా ఉంటారు. శరీరంలోని మలిన పదార్థాలన్నీ బయటకు పోయి.. క్లీన్ అవుతుంది.

మలాసనం వేయడం చాలా సింపుల్. మల విసర్జన చేసే సమయంలో ఎలా కూర్చుంటామో అలానే వేయాలి. కాకపోతే రెండు చేతులను దగ్గర పెట్టి.. నమస్కారం చేయాలి. అందుకే దీనికి మలాసనం అని పేరు వచ్చింది.

మలాసనం వేయడం వల్ల నడుము భాగం, కటి భాగాలు బలంగా తయారవుతాయి. మోకాళ్ల, కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడి శరీరంలోని మలిన పదార్థాలు బయటకు వెళ్తాయి.

శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కూడా తగ్గుతుంది. శరీరం పూర్తిగా డీటాక్స్ అవుతుంది. ఈ భంగిమలో కూర్చొని నీళ్లు తాగితే చాలా మేలు. అధిక బరువు, ఊబకాయం తగ్గుతాయి. చర్మం కూడా హైడ్రేట్ అయి.. కాంతింతంగా మారుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)




