Taiwan Earthquake: ఆ దేశంలో రెండు రోజుల్లో 100 సార్లు భూకంపం.. తీవ్రత 7.2గా నమోదు.. భయాందోళనలో ప్రజలు..
గత రెండు రోజుల్లో దేశంలో 100 సార్లు భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం తీవ్రత 7.2గా నమోదైంది. ఈ ప్రకంపనలు తీవ్రంగా ఉండడంతో ఆ ప్రాంతంలో నివసించే వారి వస్తువులు నేలకూలాయి
Taiwan Earthquake: తైవాన్ దేశంలో వరసగా రెండో కూడా భూమి కంపించింది. భారీగా భూప్రకంపనలు ఏర్పడడంతో స్థానికులు ప్రాణభయంతో వణికిపోయారు. శనివారం తర్వాత ఆదివారం మధ్యాహ్నం తైవాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. సమాచారం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12.14 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. తూర్పు తైవాన్‌లోని యుజింగ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి హువాలిన్ ప్రాంతంలో పలు ఇళ్లకు నష్టం వాటిల్లింది. భూకంపం ధాటికి రైలు.. రైల్వే ట్రాక్‌పై బోల్తా కొట్టింది. దీంతో రైలు సౌకర్యం కూడా దెబ్బతింది.
గత రెండు రోజుల్లో దేశంలో 100 సార్లు భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం తీవ్రత 7.2గా నమోదైంది. ఈ ప్రకంపనలు తీవ్రంగా ఉండడంతో ఆ ప్రాంతంలో నివసించే వారి వస్తువులు నేలకూలాయి. ఆ ప్రాంతంలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ భూకంపం ధాటికి ప్రజల్లో భయాందోళనలు నెలకొనడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు అందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
An earthquake of magnitude 7.2 occurred 85 km East of Yujing, Taiwan at around 12:14 pm IST
— ANI (@ANI) September 18, 2022
అయితే .. ఈ భూకంపం వలన సంభవించిన ప్రాణ, ఆస్తినష్టం గురించి ఎలాంటి సమాచారం లేదని స్థానిక మీడియా వెల్లడించింది. తైవాన్ కేంద్ర వార్తా సంస్థ భూకంప కేంద్రం టైటుంగ్ ప్రాంతంలో ఉందని పేర్కొంది. ఈ ప్రాంతం చుట్టూ నివసిస్తున్న ప్రజలు భారీగా నష్టపోయారు. రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఒక వంతెన కూడా దెబ్బతింది.
This couple is stranded on a bridge between two collapsed sections of a highway in SE Taiwan after multiple quakes struck the area, including one measuring 6.8 which hit at 14:44 pic.twitter.com/qVnmEQEH8F
— Tim Culpan (@tculpan) September 18, 2022
తైవాన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ హువాలియన్, టైటుంగ్‌లను కలిపే రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు , భద్రతా తనిఖీలు జరిగే వరకు మరో ఐదు హై-స్పీడ్ రైలు సేవలను నిలిపివేసినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలోని పోలీసులు, అధికారులు ప్రజలకు సహాయం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ భయంకరమైన విపత్తు తర్వాత, ఆ ప్రాంతంలో భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..