Imran Khan Arrest: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు 8 రోజుల రిమాండ్.. కొనసాగుతున్న అల్లర్లు..
పాకిస్తాన్ సుప్రీంకోర్టులో ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్ తగిలింది. అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఇమ్రాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఇమ్రాన్‌ఖాన్‌కు కోర్టుకు NAB కోర్టు 8 రోజుల రిమాండ్ విధించింది.
పాకిస్తాన్ సుప్రీంకోర్టులో ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్ తగిలింది. అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఇమ్రాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఇమ్రాన్‌ఖాన్‌కు కోర్టుకు ఎన్ఏబీ కోర్టు 8 రోజుల రిమాండ్ విధించింది.
మరోవైవు తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ను దోషిగా తేల్చింది పాక్ కోర్టు. కాగా, ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్ తరువాత పాకిస్తాన్‌లో పరిస్థితి మరింత దిగజారింది. ఇమ్రాన్ మద్దతుదారులు పలుచోట్ల హింసకు పాల్పడుతున్నారు. పెషావర్‌లో ఇమ్రాన్ మద్దతుదారులు సైన్యంపై ఏకే 47 ఆయుధాలతో కాల్పులు జరిపారు. దేశ వ్యాప్తంగా జరిగిన అల్లర్లలో 41 మంది ప్రాణాలు కోల్పోయారని, 11 మందికి తీవ్రగాయాలయ్యాయని పీటీఐ పార్టీ నేతలు వెల్లడించారు. ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, లాహోర్‌లో సహా పలు నగరాల్లో పరిస్థితి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయ్యింది.
పరిస్థితిని సమీక్షించడానికి పాక్ కేబినెట్ అత్యవసర భేటీ అయ్యింది. లండన్ నుంచి తిరిగివచ్చిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమయ్యింది. దేశంలో ఎమర్జెన్సీ విధించే అవకాశముంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..