AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: దళిత జనోద్ధారకుడు.. బ్రిటన్ పార్లమెంట్ కమిటీ హాల్‌లో ‘కేసీఆర్ కృతజ్ఞత సభ’.. ఎందుకంటే..

దళితజనోద్ధరణకు కంకణం కట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును బ్రిటన్ సమాజం వేనోల్లా పొగుడుతున్నది. వివక్షకు గురవుతూ విస్మిరించబడిన ఎస్సీ కులాల సమున్నత అభివృద్ధి కోసం సిఎం కేసీఆర్ దార్శనికతతో పనిచేస్తున్నారని.. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలు నూతన విప్లవానికి నాంది పలికాయని పేర్కొంది.

CM KCR: దళిత జనోద్ధారకుడు.. బ్రిటన్ పార్లమెంట్ కమిటీ హాల్‌లో ‘కేసీఆర్ కృతజ్ఞత సభ’.. ఎందుకంటే..
Uk Parliament Hall Cm Kcr
Shaik Madar Saheb
|

Updated on: May 10, 2023 | 7:51 PM

Share

దళితజనోద్ధరణకు కంకణం కట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును బ్రిటన్ సమాజం వేనోల్లా పొగుడుతున్నది. వివక్షకు గురవుతూ విస్మిరించబడిన ఎస్సీ కులాల సమున్నత అభివృద్ధి కోసం సిఎం కేసీఆర్ దార్శనికతతో పనిచేస్తున్నారని.. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలు నూతన విప్లవానికి నాంది పలికాయని పేర్కొంది. దళితబహుజన సబ్బండ కులాల అభ్యున్నతికోసం సిఎం కేసీఆర్ కార్యాచరణ.. దేశంలోని నలుదిక్కులతోపాటు.. విశ్వానికి సైతం పాకింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ స్థాపన చేసినందుకు, తెలంగాణ సచివాలయానికి డా.బిఆర్.అంబేద్కర్ పేరు పెట్టినందుకు, దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బ్రిటన్ ఎంపీలు, కౌన్సిలర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు కృతజ్జతలు తెలిపారు. యూకే పార్లమెంట్ కమిటీ హాల్ లో ‘అంబెడ్కర్ యూకే సంస్థ’ – ‘ప్రవాస భారతీయ సంస్థ’ ల ఆధ్వర్యంలో సమన్వయకర్త సిక్కా చంద్రశేఖర్ అధ్యక్షతన కేసీఆర్ కృతజ్జతా సభను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి కార్యాచరణను ప్రశంసిస్తూ లేఖ రాసిన బ్రిటన్ ఎంపీలు.. సోమవారం నాడు నిర్వహించిన సభకు హాజరై.. సిఎం కేసీఆర్ పాలనను ప్రశంసించారు. బ్రిటన్ పార్లమెంట్ హాల్ లో కేసీఆర్ కు కృతజ్జతలు తెలుపుతూ సభను నిర్వహిండం చర్చనీయాంశంగా మారింది.

Uk Parliament Hall

Uk Parliament Hall

డా. బిఆర్. అంబెడ్కర్ గారి కీర్తి ప్రపంచానికి చాటి చెప్పేలా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం, తెలంగాణ సచివాలయానికి అంబెడ్కర్ పేరు పెట్టడం, సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల ఉద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తుండడం.. పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సిఎం కెసిఆర్ ను అభినందిస్తూ ఈ సభను నిర్వహించారు. ఈ సందరక్భంగా కేసీఆర్ పాలన.. పథకాల డాక్యుమెంటరీని ప్రదర్శించారు. కెసిఆర్ కృతజ్ఞత సభకు హాజరైన యూకే ఎంపీలు వీరేంద్ర శర్మ, నవేదు మిశ్ర, బారోన్ కుల్దీప్ సింగ్ సహోట, ఇంకా పలువురు స్థానిక కౌన్సిలర్లు.. కేసీఆర్ పాలనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్లో నివసిస్తున్న పలువురు ప్రముఖ ఎన్నారైలతో పాటు, స్థానిక ప్రవాస సంఘాల నాయకులు, తెలంగాణ ఎఫ్డిసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, తదితరులు పాల్గొన్నారు.

Uk 3

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా బ్రిటన్ ఎంపీలు మాట్లాడుతూ… అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన గొప్ప సంఘసంస్కర్త అంబేద్కర్ అని.. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిది అని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు మాత్రమే కాకుండా వారి ఆశయాలకు అనుగుణంగా దళితుల సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిమంతంగా ఉందని బ్రిటన్ ఎంపీలు పేర్కొన్నారు. దళితులతోపాటు సబ్బండ వర్గాల కోసం గొప్ప కార్యాచరణను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్ ను అభినందించారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మొట్ట మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చాలా గర్వంగా ఉందన బ్రిటన్ లోని ఎన్నారై సంఘాల నేతలు సీఎం కేసీఆర్ ను కొనియాడారు. తెలంగాణ స్పూర్తితో భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని దళితుల సంక్షేమం కోసం ఆయా ప్రభుత్వాలు కృషి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

Uk 2

తెలంగాణ ఎఫ్ డీ సి చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయం చారిత్రాత్మకమని, ఆయన పాలనపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని తెలపారు. ఇప్పటికే రైతు బంధు పథకాన్ని ఐక్య రాజ్య సమితి గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో మొదలైన దళిత బంధు నేడు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని వివరించారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా మారిందని.. ముఖ్యంగా అంబేద్కర్ గారిని గౌరవించుకోడమే కాకుండా నేడు దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయంగా సముచిత స్థానం కలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రవాస సంస్థల ప్రతినిధులతో పాటు దళిత్ యూకే నెట్వర్క్ డైరెక్టర్ గజాల షేఖ్, అంబేద్కర్ యూకే సంస్థ ప్రతినిధి సుశాంత్ ఇంద్రజిత్ సింగ్, ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టీ.డీ.ఎఫ్ చైర్మన్ కమల్ ఓరుగంటి, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, ఉదయ్ ఆరేటి, కన్సర్వేటివ్ నాయకుడు హరి, లోకమాన్య, తదితరులు పాల్గొన్నారు.

Uk 1

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..