PM Modi US Tour: ప్రధాని మోడీ అమెరికా టూర్ ఖరారు.. మోడీ కోసం స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్న జో బిడెన్
జూన్ 22న ప్రధాని మోడీ కోసం వైట్‌హౌస్‌లో డిన్నర్‌ను ఏర్పాటు చేస్తారని వైట్‌హౌస్ తెలిపింది. ప్రధాని మోదీ పర్యటనతో భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. జూన్ నెలలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు జో బిడెన్, ఆయన భార్య జిల్ బిడెన్ తో కలిసి ప్రధాని మోడీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ బుధవారం వెల్లడించింది. జూన్ 22న ప్రధాని మోడీ కోసం వైట్‌హౌస్‌లో డిన్నర్‌ను ఏర్పాటు చేస్తారని వైట్‌హౌస్ తెలిపింది. ప్రధాని మోదీ పర్యటనతో భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, జో బిడెన్ మధ్య ఆర్థిక, ఇండో-పసిఫిక్, వాతావరణ మార్పు వంటి అనేక అంశాలపై చర్చించనున్నారు.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాను అడ్డుకునేందుకు బైడెన్ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, అమలు చేస్తున్న విధివిధానాలకు మద్దతుగా ప్రధాని మోడీ పర్యటన సాగుతుందని కేంద్రం పేర్కొంది
రాబోయే పర్యటన యునైటెడ్ స్టేట్స్, భారతదేశం మధ్య ధృడమైన బంధాన్ని, సన్నిహిత భాగస్వామ్యాన్ని పెంపొందించేలా చేస్తుందని.. అమెరికన్లు, భారతీయులను ఒకే కుటుంబం అనిపించేలా బంధాలను దృఢం చేస్తోందని పేర్కొన్నారు.
US President Joe Biden and First Lady Jill Biden will host Prime Minister Narendra Modi for an Official State Visit to the United States, which will include a state dinner, on June 22, 2023: The White House pic.twitter.com/BEh0v0nTuT
— ANI (@ANI) May 10, 2023
ప్రధాని మోడీ ఈ పర్యటన చాలా ముఖ్యమైనదని కేంద్రం పేర్కొంది. ఎందుకంటే ఈ ఏడాది జీ-20 సదస్సు భారత్‌లో జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సహా పలు దేశాల నేతలు పాల్గొంటారు. ఈ ఏడాది ఇరువురు నేతలు రెండు సార్లు భేటీ కానున్నారు.
తొలిసారిగా ప్రధాని మోడీ అమెరికాలో జో బిడెన్‌తో భేటీ కానున్నారు. అదే సమయంలో, జీ-20 సదస్సులో జో బిడెన్ ప్రధాని మోడీని కలవనున్నారు. అంతకుముందు ఇండోనేషియాలోని బాలిలో జి-20 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..