అన్నదాతకు కాసుల పంటను పండిస్తున్న పండ్లు, కూరగాయలు.. సెకండ్ ప్లేస్‌లో భారత్.. ఏ దేశం ఫస్ట్‌ప్లేస్ అంటే
గత కొంతకాలంగా భారతదేశంలో హార్టికల్చర్ ఉత్పత్తి ఎక్కువగా ఉంది. ఎంతగా అంటే.. ఇప్పుడు పండ్లు, కూరగాయల పంటలు ఉత్పత్తి.. ఆహార ధాన్యాల ఉత్పత్తిని కూడా దాటేసింది. దీంతో రైతులు ఉద్యానవన పంటలతో మంచి ఆదాయాన్ని పొందవచ్చని నిరూపిస్తున్నారు.
మనిషి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆధునికతను జోడించి వ్యవసాయం చేస్తే.. కాసుల పంట పండుతుంది. వ్యవసాయం దండగ కాదు పండగ అనిపిస్తుంది. మనదేశంలో రైతులు భిన్నమైన పద్ధతులను పాటిస్తూ ఉద్యానవన పంటలను పండిస్తున్నారు. దీంతో ఉద్యానవన రంగంలో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా అవతరించింది. వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకారం వరి , గోధుమ వంటి సాంప్రదాయ పంటల కంటే హార్టికల్చర్‌లో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది. విశేషమేమిటంటే సాంప్రదాయ వ్యవసాయంతో పోల్చితే హార్టికల్చర్ ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తోంది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి పరంగా భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది. మొదటి ప్లేస్ లో చైనా నిలిచింది.
అగ్రి న్యూస్ ప్రకారం.. భారతదేశ భూములు, వాతావరణం తోటల పెంపకానికి అనుకూలం. అలాగే ఇతర దేశాలతో పోలిస్తే సాగు ఖర్చు తక్కువ. భారతదేశం పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేయడానికి ఇదే కారణం. అయితే మనదేశంలో ఉద్యానవన పంటలు స్థూల పంట విస్తీర్ణం కేవలం 13.1% మాత్రమే. అయినప్పటికీ, GDP దాదాపు 30.4 శాతం ఉంది. ఉద్యానవన వ్యవసాయం మన దేశ వ్యవసాభివృద్ధిలో మూల స్తంభంగా మారింది.
ఉద్యానవన పంటల ఉత్పత్తిలో 13 శాతం వాటా
అనేక రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఆధారం ఉద్యానవన పంటలు. బీహార్‌లో వేలాది మంది రైతులు హార్టికల్చర్‌పై ఆధారపడి తమ జీవనోపాధిని పొందుతున్నారు. ఈ రాష్ట్రంలో పండే లిచీ పండ్లు ఉత్పత్తి మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా షాహీ లిచ్చిని ఎగుమతి చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ మఖానా పంట కూడా అత్యధికంగా పండిస్తున్నారు. ప్రపంచంలోనే బీహార్లో అత్యధికంగా మఖానాను పండిస్తున్నారు. ఇక మామిడి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఇక బెండకాయల ఉత్పత్తిలోకూడా బీహార్ ముందంజలో ఉంది. దేశంలోనే బెండకాయ ఉత్పత్తిలో రైతులకు 13 శాతం వాటా ఉంది. ఈ రాష్ట్రంలోని రైతులు హార్టికల్చర్ వైపుకు వెళ్లి లాభాల బాట పట్టారు.
గత కొంతకాలంగా భారతదేశంలో హార్టికల్చర్ ఉత్పత్తి ఎక్కువగా ఉంది. ఎంతగా అంటే.. ఇప్పుడు పండ్లు, కూరగాయల పంటలు ఉత్పత్తి.. ఆహార ధాన్యాల ఉత్పత్తిని కూడా దాటేసింది. దీంతో రైతులు ఉద్యానవన పంటలతో మంచి ఆదాయాన్ని పొందవచ్చని నిరూపిస్తున్నారు. హార్టికల్చర్ పంటలు పోషక అవసరాలను తీర్చడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని కూడా కల్పిస్తుంది. లక్షలాది మంది కూలీల ఇంటి ఖర్చులను హార్టికల్చర్ పంటలతో సంపాదిస్తున్నారు,
కూరగాయల ఉత్పత్తి దాదాపు 204.61 మిలియన్ టన్నులు
భారతదేశం ఉద్యానవన ఉత్పత్తిలో చాలా పురోగతి సాధించింది. 2001-02 సంవత్సరంలో హార్టికల్చర్ ఉత్పత్తి హెక్టారుకు 8.8 టన్నులు కాగా, 2020-21 సంవత్సరంలో హెక్టారుకు 12.1 టన్నులకు పెరిగింది. దీంతో పాటు ఉద్యాన పంటలు సాగు చేసే రైతుల సంఖ్య కూడా బాగా పెరిగింది. 2021-22 సంవత్సరంలో హార్టికల్చర్ ఉత్పత్తి 341.63 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది, ఇందులో పండ్ల ఉత్పత్తి సుమారు 107.10 మిలియన్ టన్నులు కాగా కూరగాయల ఉత్పత్తి సుమారు 204.61 మిలియన్ టన్నులు. అటువంటి పరిస్థితిలో రైతులు ఉద్యానవన పంటలవైపు దృష్టి సారిస్తే.. తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చు. తద్వారా వారి ఆదాయం పెరుగుతుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..