Electric Roads in India: రయ్ రయ్ మంటూ దూసుకుపోతూనే ఛార్జింగ్ చేసుకోవచ్చు.. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ రహదారులు..

నితిన్ గడ్కరీ ఎలక్ట్రిక్ హైవే గురించి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఇప్పుడు దీని కోసం చర్చలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ రోడ్లు ఎలా ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Electric Roads in India: రయ్ రయ్ మంటూ దూసుకుపోతూనే ఛార్జింగ్ చేసుకోవచ్చు.. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ రహదారులు..
Electric Highway
Follow us

|

Updated on: May 11, 2023 | 7:19 AM

భారతదేశంలో గత ఒకటి లేదా రెండు సంవత్సరాలలో ఎలక్ట్రిక్ వాహనాలు బాగా ప్రాచుర్యం పొందాయి. దేశంలో ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు ఊపందుకున్నాయి. ఇవి డీజిల్, పెట్రోలుతో నడిచే వాహనాల కంటే పర్యావరణానికి మరింత స్నేహపూర్వకంగా ఉండటమే కాకుండా.. సామాన్యులకు ఆర్ధికంగా మేలు చేస్తున్నాయి. ఏదేమైనా, ప్రతిరోజూ అభివృద్ధి చెందుతున్న కొత్త సాంకేతికత మధ్య, అటువంటి రహదారిని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఈ వాహనాల అవసరాన్ని తొలగిస్తుంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో కాలుష్యాన్ని పరిష్కరించడానికి.. ఉపాధిని సృష్టించడానికి వినూత్న పరిష్కారాలు కావాలని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చాలాసార్లు ప్రస్తావించిన ఎలక్ట్రిక్ రోడ్, ఎలక్ట్రిక్ హైవే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మరోసారి ప్రస్తావిస్తూ.. దేశంలో ఇలాంటి రోడ్లు నిర్మించేందుకు కొన్ని సంస్థలతో చర్చలు కూడా జరిపామన్నారు. ఇంధనం, ఎలక్ట్రిక్ హైవేలు, మైనింగ్ బంజరు భూములను స్థిరంగా వినియోగించుకోవడంలో స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయాలని మంత్రి కోరారు. దిగుమతి చేసుకున్న బొగ్గుకు ప్రత్యామ్నాయంగా బంజరు భూములపై వెదురును పెంచాలని ప్రతిపాదించారు. నీరు, ఇథనాల్ నుంచి హైడ్రోజన్ సామర్థ్యాన్ని హైలైట్ చేశారు.

స్థిరమైన అభివృద్ధి అంతిమ లక్ష్యం

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటే CII కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా లాభసాటిగా ఉండే ఎలక్ట్రిక్‌ హైవే అభివృద్ధికి పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. సుస్థిర అభివృద్ధే అంతిమ లక్ష్యమని, ఇందుకు రవాణా రంగంలో తక్కువ ఖర్చుతో కూడిన కాలుష్య రహిత, స్వదేశీ సాంకేతికత అవసరమని అన్నారు. స్థిరమైన వ్యాపార నమూనాలను రూపొందించేందుకు పెద్ద కంపెనీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

వృత్తాకార ఆర్థిక వ్యవస్థను అవలంబించడం ద్వారా, తయారీ ఖర్చులు, దిగుమతులను గణనీయంగా తగ్గించవచ్చని గడ్కరీ సూచించారు. రాగి, అల్యూమినియం వంటి లోహాలను రీసైక్లింగ్ చేయడం వలన ఆటో కాంపోనెంట్ తయారీ ఖర్చులు 20-25 శాతం తగ్గుతాయన్నారు.

గడ్కరీ మాట్లాల్లో..

ఆర్థికంగా లాభదాయకమైన ఎలక్ట్రిక్ హైవేను రూపొందించడంపై టాటాతో పాటు మరికొన్ని కంపెనీలతో నిన్న మాత్రమే చర్చించామని కేంద్ర మంత్రి గడ్కారీ తెలిపారు. మన నగరాలు అభివృద్ధి చెందుతున్న తీరుతో.. చివరికి మన పట్టణ చట్టాలను సవరించాల్సి ఉంటుంది. బెంగళూరు లాంటి నగరంలో ప్రజలు ఆఫీసుకు చేరుకోవడానికి రెండు గంటల సమయం పడుతుంది.

మన దేశం పని ప్రారంభించింది

గడ్కరీ కొంతకాలం క్రితం ఎలక్ట్రిక్ రహదారుల అభివృద్ధి భావనను ప్రవేశపెట్టారు. మరికొన్ని దేశాలు కూడా అలాంటి రహదారులపై కసరత్తు చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఇటువంటి రహదారులు ఇప్పటికే నిర్మించబడ్డాయి. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో కొన్ని సంవత్సరాల క్రితం ఎలక్ట్రిక్ రోడ్డు నిర్మించబడింది. ముందుగా రోడ్డు శివార్లలో కొన్ని కిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా సిద్ధం చేశారు. ఇప్పుడు స్వీడన్ దాదాపు 3000 కిలోమీటర్ల పొడవునా అలాంటి హైవేని నిర్మించేందుకు సిద్ధమవుతోంది.

ఎలక్ట్రిక్ రోడ్లు ఎలా ఉంటాయాంటే..

ఎలక్ట్రిక్ రోడ్ల గురించి తెలుసుకోవాలని అనుకుంటే, ఇది గ్రహాంతర భావన కాదు. ట్రామ్ రూపంలో దీని వాడకాన్ని ప్రపంచం చూసింది. ఇప్పుడు పట్టణ రవాణాకు అనువుగా ఉండేలా, సుదూర ప్రాంతాలకు సులభంగా ప్రయాణించగలిగేలా రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనితో పాటు, ఆర్థికంగా, పర్యావరణ అనుకూలత కూడా తప్పనిసరి పరిస్థితి. ఇందుకోసం చాలా కంపెనీలు తమ కాన్సెప్ట్‌లను అందించాయి. కొన్ని నమూనాలు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్ మీద ఆధారపడి ఉంటాయి. దీన్ని ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి.. మీరు రైలు లేదా మెట్రోని చూడవచ్చు. అదే సమయంలో, టైర్ల ద్వారా వాహనాల ఇంజిన్‌కు విద్యుత్ ప్రసారం చేయాలనే ప్లాన్ కూడా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం