ONDC: జోమాటో, స్విగ్గీలకు చెక్! మరింత తక్కువ ధరకే ఫుడ్ డెలివరీలు.. ప్రభుత్వ భరోసా కూడా..

అనేక రకాల ఫుడ్ యాప్స్ కారణంగా వినియోగదారులు పడుతున్న గందరగోళానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్టే. ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఓఎన్డీసీ ద్వారా హోటళ్లు దీనిలో రిజిస్టర్ అవుతాయి. దీంతో నేరుగా ఆ హోటల్ నుంచి ఫుడ్ డెలివరీలు పొందవచ్చు.

ONDC: జోమాటో, స్విగ్గీలకు చెక్! మరింత తక్కువ ధరకే ఫుడ్ డెలివరీలు.. ప్రభుత్వ భరోసా కూడా..
Online Food Ordering
Follow us
Madhu

|

Updated on: May 10, 2023 | 4:45 PM

ప్రస్తుతం ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ బాగా పాపులర్ అయ్యింది. అందరూ జోమాటో, స్విగ్గీ వంటి యాప్ ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడం, నిమిషాల్లోనే నచ్చిన ఫుడ్ ని ఇంట్లోనే ఉండి ఆస్వాదించడం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ బాగా పెరిగింది. హోటల్ కి వినియోగదారునికి మధ్య వారధిగా ఈ ప్రైవేటు యాప్స్ ఉంటున్నాయి. అయితే ఈ ప్రైవేటు యాప్ లలో ట్యాక్స్ అధికంగా ఉండటంతో మొత్తం ఫుడ్ కాస్ట్ బాగా పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులకు కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఓఎన్డీసీ(ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్)ను తీసుకొచ్చింది. ఈ ఓఎన్డీసీ ద్వారా ఎటువంటి యాప్ల జోలికి వెళ్లకుండా డైరెక్ట్ గా హోటల్ యాజమాన్యం నుంచే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

గందరగోళానికి చెక్..

అనేక రకాల ఫుడ్ యాప్స్ కారణంగా వినియోగదారులు పడుతున్న గందరగోళానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్టే. ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఓఎన్డీసీ ద్వారా హోటళ్లు నేరుగా దీనిలో రిజిస్టర్ అవుతాయి. దీంతో నేరుగా ఆ హోటల్ నుంచి ఫుడ్ డెలివరీలు పొందవచ్చు. ఈ ఓఎన్డీసీ 2022 సెప్టెంబర్ నుంచి అందుబాటులో ఉంది. ఇటీవల కాలంలో ఇది కూడా బాగా పాపులర్ అయ్యింది. ప్రతి రోజూ 10,000 ఆర్డర్లు దీని నుంచి వెళ్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఈ ఓఎన్డీసీ యాప్ లో కొనుగోలు చేసిన ఫుడ్ ఆర్డర్ బిల్లలను వినియోగదారులు స్క్రీన్ షాట్లు తీసి.. వాటిని జోమాటో, స్విగ్గీ బిల్లులతో పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అన్ని చోట్లా లేదు..

అయితే ఈ నెట్ వర్క్ కొత్తది కావడంతో అన్ని నగరాల్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. మొదటిగా ఇది సెప్టెంబర్ 2022లో బెంగళూరులో దీనిని కార్యకలాపాలు ప్రారంభించింది. పేటీఎం యాప్ సాయంతో దీనిని యాక్సెస్ చేయొచ్చు. మీ సిటీలోకి అందుబాటులో ఉందోలేదో తెలియాలంటే వెంటనే మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేస్తే మీ సిటీలో ఈ నెట్ వర్క్ అందుబాటులో ఉందో లేదో తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎలా వినియోగించాలి..

ఈ ఓఎన్డీసీ నెట్ వర్క్ ను వినియోగించాలంటే ముందుగా మీరు పేటీఎం యాప్ ఓపెన్ చేయాలి. దానిలో సెర్చ్ ఆప్షన్ లోకి వెళ్లి ఓఎన్డీసీ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. హోస్క్రీన్ కింద భాగంలో మీకు ఓఎన్డీసీ స్టోర్ అని ఓ ఆప్షన్ కనిపిస్తుంది. దానిలో చాలా రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. నిత్యాసవరాల దగ్గర నుంచి గృహోపకరణాలు, ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. ఏదైనా రెస్టారెంట్ నుంచి మీరు ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే ఓఎన్డీసీ ద్వారా ఆర్డర్ ఇవ్వొచ్చు. మొదటి మీ పిన్ నంబర్ ఎంటర్ చేస్తే మీరు ఉండే ప్రదేశంలో సర్వీస్ ఉందో లేదో చెబుతుంది. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలోనే ఉంది. రానున్న రోజుల్లో అన్ని నగరాల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!