Whatsapp Update: వాట్సాప్‌లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్.. కానీ వారికి మాత్రమేనంట..!
ముఖ్యంగా మెసేజ్‌లను పంపిన తర్వాత వాటిని ఎడిట్ చేసే అవకాశం కోసం చాలా మంది వినియోగదారుల ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఫీచర్ ఈ సంవత్సరం ప్రారంభంలో వాట్సాప్ ప్రకటించింది. అయినా విస్తృత స్థాయిలో మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌కి యాక్సెస్ ఉన్న ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇ

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు దాని ప్లాట్‌ఫారమ్‌ను మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషిస్తుంది. ముఖ్యంగా నిత్యం ఏదో ఒక కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మెసేజ్‌లను పంపిన తర్వాత వాటిని ఎడిట్ చేసే అవకాశం కోసం చాలా మంది వినియోగదారుల ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఫీచర్ ఈ సంవత్సరం ప్రారంభంలో వాట్సాప్ ప్రకటించింది. అయినా విస్తృత స్థాయిలో మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌కి యాక్సెస్ ఉన్న ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా వచన సందేశం కోసం మెను ఎంపికల నుంచి ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు. చాట్‌లోని ప్రతి ఒక్కరికి వాట్సాప్ యొక్క తాజా వెర్షన్ ఉన్నంత వరకు సవరించిన సందేశాలు వెళ్తాయి.ఏదైనా వచన సందేశం కోసం మెనూ ఎంపికల నుంచి ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు. చాట్‌లోని ప్రతి ఒక్కరికి వాట్సాప్ తాజా వెర్షన్ ఉన్నంత వరకు సవరించిన సందేశాలు నవీకరణ అవుతాయి.
వాట్సాప్ ఈ ఫీచర్‌ని సపోర్ట్ చేయని పాత వెర్షన్‌ల గడువు ముగిసినప్పుడు యూజర్లందరికీ లాంచ్ చేసే అవకాశం ఉంది. మీరు ఈ ఎంపికను ఎంచుకున్నప్పుడు సందేశాన్ని కొత్త విండోలో సవరించమని మీరు ప్రాంప్ట్ చేయబడతారు. ఒకవేళ మీ వాట్సాప్ ఖాతా కోసం ఫీచర్ ప్రారంభిస్తే మీ చాట్‌లు, సమూహాల్లో మీ సందేశాలను సవరించడానికి మీకు 15 నిమిషాల సమయం ఉంటుంది. అలాగే ఈ ఫీచర్ ద్వారా సందేశాలను అనేకసార్లు సవరించడం సాధ్యమవుతుంది. సంభాషణకు సంబంధిచంిన ప్రామాణికతను కొనసాగించడానికి సందేశాలను సవరించడానికి పరిమితి సెట్ చేశారు. అంటే వినియోగదారులు నిర్ణీత సమయం దాటిన తర్వాత ఈ సందేశాన్ని పూర్తిగా మార్చలేరు. ఎందుకంటే ఈ ఫీచర్ టైపింగ్ లోపాలను సరిదిద్దడానికి మాత్రమే ఉపయోగించాల్సిన సాధనంగా ఉపయోగించాలని వాట్సాప్ భావిస్తోంది.
వాట్సాప్ సందేశాలను సవరిచండిలా
- మీరు సందేశాన్ని సవరించాలనుకుంటున్న వాట్సాప్ కాంటాక్ట్‌ను తెరవాలి.
- మీరు సవరించాలనుకుంటున్న సందేశాన్ని నొక్కి పట్టుకోవాలి.
- మెను నుంచి “సవరించు” ఎంపికను ఎంచుకోవాలి.
- మీకు కావలసిన మార్పులు చేసి, “పూర్తయింది” బటన్‌ను నొక్కాలి.
- మీ మార్పులు సేవ్ అవుతాయి. అనంతరం సవరించిన సందేశం సంభాషణలో చూపుతుంది.
మరన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..