AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme 11 Pro Plus: మార్కెట్‌లో దూసుకొస్తున్న రియల్‌మీ నయా ఫోన్.. 200 పిక్సెల్ కెమెరాతో పాటు మతిపోగుడుతున్న ఫీచర్లు..

భారతదేశంలో రియల్ మీ ప్రవేశించి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సూపర్ ఫోన్‌ లాంచ్ చేయాలని భావిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఫోన్ వివరాలు రియల్ మీ కంపెనీ డైరెక్ట్‌గా చెప్పనప్పటికీ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో అద్భుతమైన మొబైల్ ఫోటోగ్రఫీని అందించడానికి హార్డ్‌వేర్‌ను పూర్తి చేయడం కోసం ఫోన్ సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలను అందిస్తుందని పేర్కొంది.

Realme 11 Pro Plus: మార్కెట్‌లో దూసుకొస్తున్న రియల్‌మీ నయా ఫోన్.. 200 పిక్సెల్ కెమెరాతో పాటు మతిపోగుడుతున్న ఫీచర్లు..
Realme 11 Pro
Nikhil
|

Updated on: May 10, 2023 | 6:00 PM

Share

భారతదేశంలో లాంచింగ్ సమయం నుంచి స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న రియల్ మీ కంపెనీ తాజాగా మరో కొత్త ఫోన్ లాంచ్ చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో రియల్ మీ ప్రవేశించి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సూపర్ ఫోన్‌ లాంచ్ చేయాలని భావిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఫోన్ వివరాలు రియల్ మీ కంపెనీ డైరెక్ట్‌గా చెప్పనప్పటికీ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో అద్భుతమైన మొబైల్ ఫోటోగ్రఫీని అందించడానికి హార్డ్‌వేర్‌ను పూర్తి చేయడం కోసం ఫోన్ సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలను అందిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రియల్ మీ 11 సిరీస్‌ను చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి భారత్‌లో రియల్ మీ కంపెనీ ప్రవేశపెట్టే ఫోన్ ఇదేనని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రియల్‌మీ 11 సిరీస్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో ప్లస్ వేరియంట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫోన్ త్వరలో భారత్‌లోకి రానుందని పేర్కొంటున్నారు. 

భారతీయ మార్కెట్ కోసం ఊహించిన రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ మరింత మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి కొత్త హార్డ్‌వేర్‌తో పాటు కొన్ని ప్రత్యేక ఫీచర్లు కలిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ రూ.30,000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకవచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఈ ఫోన్ లెదర్ బ్యాక్, రౌండ్-రియర్ కెమెరా మాడ్యూల్‌‌తో వచ్చే అవకాశం ఉంది. మధ్యలో 200 మెగాపిక్సెల్ కెమెరాతో సామ్‌సంగ్ ఐసో సెల్ హెచ్‌పీ3 సెన్సార్ ఉంది. ప్రైమరీ కెమెరా సెన్సార్ 4 ఎక్స్ లాస్‌లెస్ జూమ్, 20 ఎక్స్ మూన్ మోడ్ జూమ్‌ను అందించవచ్చు రెండూ హైబ్రిడ్ జూమ్ లేదా డిజిటల్ జూమ్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎమోఎల్ఈడీ స్క్రీన్, డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో 12 జీబీ+ 256 జీబీ వేరియంట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..