Realme Anniversary Sale: రియల్ మీ వార్షికోత్సవ ఆఫర్లు ప్రారంభం.. ఆ ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఇతర ప్రొడెక్ట్స్‌పై తగ్గింపు ఇలా

ఈ ఆఫర్‌ రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో మే 1 నుంచి 11 వరకూ అందుబాటులో ఉంటుంది. రియల్‌మీ ఉత్పత్తులపై కస్టమర్‌లు గణనీయమైన తగ్గింపులను అందుకుంటారని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఒక్క స్మార్ట్‌ఫోన్‌లపై మాత్రమే కాకుండా  ల్యాప్‌టాప్‌ల‌తో పాటు రియల్‌మీ ఉత్పత్తి చేసే అనేక రకాల వస్తువులపై భారీ తగ్గింపులను అందిస్తుంది.

Realme Anniversary Sale: రియల్ మీ వార్షికోత్సవ ఆఫర్లు ప్రారంభం.. ఆ ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఇతర ప్రొడెక్ట్స్‌పై తగ్గింపు ఇలా
Online
Follow us
Srinu

|

Updated on: May 02, 2023 | 5:45 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ ఐదో వార్షికోత్సవం సందర్భంగా అదిరిపోయే ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకవచ్చింది. ఈ ఆఫర్‌ రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో మే 1 నుంచి 11 వరకూ అందుబాటులో ఉంటుంది. రియల్‌మీ ఉత్పత్తులపై కస్టమర్‌లు గణనీయమైన తగ్గింపులను అందుకుంటారని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఒక్క స్మార్ట్‌ఫోన్‌లపై మాత్రమే కాకుండా  ల్యాప్‌టాప్‌ల‌తో పాటు రియల్‌మీ ఉత్పత్తి చేసే అనేక రకాల వస్తువులపై భారీ తగ్గింపులను అందిస్తుంది. ముఖ్యంగా రియల్‌మీ జీ2 ప్రోపై ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 2000 వరకు బ్యాంక్ ఆఫర్‌తో కలిపి ధరపై రూ. 14,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అంటే ఈ ఫోన్ ప్రస్తుతం రూ.35999కు అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌పై దాదాపు రూ.26000 వరకూ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్ మీ జీటీ 2 ప్రో 8 జీబీ +128 జీబీ, 12 జీబీ +256 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ వార్షికోత్సవ ఆఫర్‌లో రియల్ మీ బడ్స్ ఎయిర్ 3 ఎస్ పై రూ.200 తగ్గింపు అలాగే రియల్ మీ బడ్స్ ఎయిర్ 3 నియోపై రూ.100 తగ్గింపు వంటికి లభిస్తున్నాయి అత్యధిక ఆఫర్‌తో వచ్చే రియల్ మీ జీటీ 2 ప్రో ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

రియల్‌మీ జీటీ 2 ప్రో ఫీచర్లు ఇవే

రియల్ మీ జీటీ 2 ప్రోలో కొత్తగా విడుదలైన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌తో ఉంటుంది. రియల్‌మీ జీటీ 2 ప్రో బయో-బేస్డ్ మెటీరియల్‌తో రూపొందించారు. ఈ ఫోన్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఇన్-బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో ఫ్రంట్ కెమెరా 150 డిగ్రీల అల్ట్రా-వైడ్ యాంగిల్‌ను కలిగి ఉన్న మొదటి స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఇక ప్రైమరీ కెమెరాలో 84-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో  వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి ఫిష్‌ఐ మోడ్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. ఇది అల్ట్రా-లాంగ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్‌ను అందిస్తుంది. హైపర్‌స్మార్ట్ యాంటెన్నా స్విచింగ్ టెక్నాలజీ కూడా వీటిలో ఉంది. ఇది ఫోన్‌లోని అన్ని వైపులా కవర్ చేసే 12 ర్యాప్ అరౌండ్ యాంటెన్నాలతో రూపొందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..