Noise Smart Watch: నాయిస్ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ వాచ్.. ఎవ్వరూ ఇవ్వలేని అద్భుత ఫీచర్స్ ఇవే..
మార్కెట్‌లోకి ఏ కంపెనీ ఇవ్వలేని ఫీచర్లను నాయిస్ తన ఫిట్ ఫోర్స్ స్మార్ట్ వాచ్‌లో అందిస్తుంది. కేవలం రూ.3999కు అందుబాటులో ఉండే ఈ వాచ్‌ను నాయిస్ వెబ్‌సైట్ లేదా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ యువతను ఆకట్టుకోవడానికి మరో కొత్త స్మార్ట్ వాచ్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. నాయిస్‌ఫిట్ ఫోర్స్ ప్లస్ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌వాచ్‌లో అనేక ఫీచర్లను అందిస్తుంది. మార్కెట్‌లోకి ఏ కంపెనీ ఇవ్వలేని ఫీచర్లను నాయిస్ తన ఫిట్ ఫోర్స్ స్మార్ట్ వాచ్‌లో అందిస్తుంది. కేవలం రూ.3999కు అందుబాటులో ఉండే ఈ వాచ్‌ను నాయిస్ వెబ్‌సైట్ లేదా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ జెట్ బ్లాక్, మిక్స్‌డ్ గ్రే, టీల్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్‌లో వచ్చే ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
నాయిస్ ఫిట్ ఫోర్స్ ప్లస్ ఫీచర్లు ఇవే
నాయిస్ ఫిట్ ఫోర్స్ ప్లస్ వాచ్ ఓ సారి చార్జ్ చేస్తే ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఐపీ 67 ద్వారా వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఈ వాచ్ ప్రత్యేకత. 1.46 అంగుళా ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ వాచ్ 466×466 స్క్రీన్ రిజుల్యూషన్‌తో వస్తుంది. 500 నిట్స్ పీక్ బ్రైైట్‌నెస్‌తో డిస్‌ప్లే కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అలాగే వినియోగదారులు డైరెక్ట్‌గానే ఈ వాచ్ నుంచి కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే నాయిస్ బజ్ యాప్ ద్వారా ఈ వాచ్‌లో 10 మంది నంబర్స్ సేవ్ చేసుకునే అవకాశం ఉంది. హార్ట్ బీట్ రేట్, ఎస్‌పీఓ2, స్లీప్ మానిటర్, స్ట్రెస్ కాలిక్యులేటర్, బ్రీత్ ప్రాక్టీస్, ఆడవారి కోసం రుతు చక్ర ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఈ వాచ్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. ఈ వాచ్‌లో యూజర్లు రిమైండర్లు, వాతావరణ సూచనలను సులభంగా పొందవచ్చు. ఈ నాయిస్ ఫిట్ ఫోర్స్ ప్లస్ స్మార్ట్ వాచ్‌లో 130కు పైగా వాచ్ స్పోర్ట్స్ మోడ్స్, 100కు పైగా వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి. నాయిస్ ఫిట్ యాప్‌తో వాచ్‌ను లింక్ చేయడం ద్వారా సులభంగా స్పోర్ట్స్ మోడ్‌లను మార్చుకోచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..