Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Noise Ear buds: 40 గంటల బ్యాటరీ లైఫ్ తో పాటు అత్యాధునిక ఫీచర్ల కలిగిన ఇయర్ బడ్స్.. ధర ఎంతంటే..

దేశీయ బ్రాండ్ నాయిస్ మరో సరికొత్త ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీఎస్102 ప్రో(VS102 Pro) పేరిట ట్రూ వైర్ లెస్ స్టీరియో(టీడబ్ల్యూఎస్) ఇయర్ బడ్స్ ను ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Noise Ear buds: 40 గంటల బ్యాటరీ లైఫ్ తో పాటు అత్యాధునిక ఫీచర్ల కలిగిన ఇయర్ బడ్స్.. ధర ఎంతంటే..
Noise Buds
Follow us
Madhu

|

Updated on: Feb 02, 2023 | 2:30 PM

ఇది డిజిటల్ కాలం.. అంతా వైర్ లెస్ నే ఇష్టపడుతున్నారు. బ్లూటూత్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చాక అంతా వైర్ లెస్ అయిపోయింది. ఇదే క్రమంలో వైర్ లెస్ ఇయర్ ఫోన్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇయర్ బడ్స్ గా పిలుస్తున్న ఈ ఎలక్ట్రానికి గ్యాడ్జెట్ పై యువత కూడా బాగా మక్కువ చూపుతోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో దేశీయ బ్రాండ్ నాయిస్ మరో సరికొత్త ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీఎస్102 ప్రో(VS102 Pro) పేరిట ట్రూ వైర్ లెస్ స్టీరియో(టీడబ్ల్యూఎస్) ఇయర్ బడ్స్ ను ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

40 గంటల బ్యాటరీ సామర్థ్యం..

ఈ డివైజ్ లో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్(ఏఎన్సీ) ఫీచర్ తో వస్తుంది. ఏఎన్సీ ఏనేబుల్ చేస్తే 36 గంటలు, ఏఎన్సీ డీజేబుల్ చేస్తే 40 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఈ ఫీచర్ తో ఎక్కువ శబ్దాలు ఉండే ప్రాంతాల్లో ఫోన్ మాట్లాడేటప్పుడు అవసరం లేని శబ్దాలను కాలర్ కు వినపడకుండా చేస్తుంది. అలాగే ఇది ట్రాన్సరపరేన్సీ ఫీచర్ ను కూడా అందిస్తుంది. పబ్లిక్ ఉన్నప్పుడు బడ్స్ తీసే అవసరం లేకుండానే ఎదుటి వారితో మంచిగా కమ్యూనికేషన్ చేసుకునే వీలు కల్పిస్తుంది.

ధర ఎంతంటే..

మూడ కలర్ వేరియంట్లలో ఈ నాయిస్ ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. జెట్ బ్లాక్, కామ్ బీజ్, అరోరా గ్రీన్, గ్లేసియర్ బ్లూ వంటి ఆప్షన్లో వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీని ధర రూ. 1,799 గా కంపెనీ నిర్ధారించింది. దీనిలో టైప్ సీ యూఎస్బీ చార్జర్ అందుబాటులో ఉంది. అలాగే చెమట, నీరు రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది. దీనిలో 5.3 బ్లూటూత్ సౌకర్యవంతమైన కనెక్షన్ తో పాటు క్వాడ్ మైక్ వ్యవస్థను అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..