EV Scooters: రూ. 1 లక్షలోపు తక్కువ బడ్జెట్‌లో లభించే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
Ravi Kiran |
Updated on: Feb 02, 2023 | 1:39 PM
మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, సరికొత్త ఫీచర్లు, అద్భుతమైన మైలేజ్‌తో రూ. 1 లక్షలోపు తక్కువ బడ్జెట్‌లో దొరికే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందామా.?
Feb 02, 2023 | 1:39 PM
హీరో ఎలక్ట్రిక్ NYX, ఈ ఎలక్ట్రిక్ వాహనం ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.73,590. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఇది 3 సంవత్సరాల ప్రామాణిక వారంటీతో లభిస్తోంది. దీని బ్యాటరీ రకం Lithium-Ion, సామర్థ్యం 48 V/56 Ah. అలాగే ఈ స్కూటర్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. గరిష్టంగా 42 kmph వేగంతో వెళ్తుంది.
1 / 5
Ola S1, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,999. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, 181 కిలోమీటర్ల వరకు వస్తుంది. 6 గంటల 30 నిమిషాలలో ఫుల్‌గా ఛార్జ్ అవుతుంది. ఇది 4 kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
2 / 5
బౌన్స్ ఇన్ఫినిటీ E1: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 47,499. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 1.9 KWh.
3 / 5
కైనెటిక్ గ్రీన్ జూమ్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.75,100. 3 నుంచి 4 గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కి.మీ వెళ్లొచ్చు. ఇది 60 V/28 Ah బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
4 / 5
AMO Electric Jaunty-3W: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.78,819. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 75 కి.మీ. ఈ స్కూటర్ 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 60 V 26 Ah. గరిష్ట వేగం గంటకు 25 కి.మీ.