Buffalo Died: హెలికాప్టర్ ‘శబ్దం’ వల్లే గేదె చనిపోయింది.. పైలట్‌పై రైతు ఫిర్యాదు..!
రాజస్థాన్‌లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. బల్బీర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో విచిత్రమైన కేసు పెట్టాడు. హెలికాప్టర్ చేసిన శబ్ధం వల్లే తన గేదె చనిపోయిందంటూ పైలట్‌పై కేసు వేశాడు.
అల్వార్ జిల్లా బహ్‌రోడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ తన గ్రామానికి వస్తున్నారని.. అతనికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు కార్యకర్తలు. హెలికాప్టర్ ద్వారా తమ ప్రియతమ నాయకుడిపై పూల వర్షం కురిపించాలనుకున్నారు. అనుకున్నట్టుగానే నవంబరు 13న హెలికాప్టర్ నుంచి ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపించారు. అనంతరం హెలికాఫ్టర్ కోహ్రానా అనే గ్రామం మీదుగా వెళ్లింది. అయితే ఆ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో వెళ్లడం వల్ల.. చాలా పెద్దగా శబ్దం వచ్చింది. దీనివల్ల ఆ చుట్టుపక్కల వాళ్లు కొంచెం ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో ఆ హెలికాప్టర్ చేసిన శబ్ధం వల్లే తన గేదె చనిపోయిందని హెలికాప్టర్ నడిపిన పైలట్‌పై ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశాడు బల్వీర్ అనే వృద్ధుడు. చనిపోయిన తన గేదె విలువ సూమారు లక్షన్నర వరకు ఉంటుందని ఫిద్యాదులో పేర్కొన్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Nov 16, 2022 09:46 PM
వైరల్ వీడియోలు
Latest Videos