Woman happy life: ఇది కదా ఆనందం.. పరిసరాలను మరిచి పెర్ఫార్మెన్స్.. నెటిజన్లు ఫిదా..!
మనుషుల ఆహార్యాన్ని చూసి అంచనా వేయకూడదంటారు. ఇలా చేస్తే పప్పులో కాలు వేసినట్లే అని అనేక సందర్భాలలో నిరూపితమయింది కూడా. ఇంకా మానవ ప్రపంచంలో సంతోషకరంగా గడపడమనేది
మనుషుల ఆహార్యాన్ని చూసి అంచనా వేయకూడదంటారు. ఇలా చేస్తే పప్పులో కాలు వేసినట్లే అని అనేక సందర్భాలలో నిరూపితమయింది కూడా. ఇంకా మానవ ప్రపంచంలో సంతోషకరంగా గడపడమనేది జీవితానికి అందిన ఒక వరం. సమస్యలను అధిగమిస్తూ.. ప్రశాంతంగా గడుపుతారు. అలాంటి జీవిత పాఠాన్ని బోధించేలా ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసినవారెవరైనా నోరెల్లబెట్టకుండా ఉండలేరు. ఇక ఆ వీడియోలో.. చీర కట్టులో ఉన్న ఓ మహిళ మెట్రో రైలులో ఉండే హాంగర్లకు వేలాడి సంతోషకరమైన అనుభూతి పొందారు. ఆమెను అనుసరిస్తూ మరో యువతి కూడా అలాగే చేసింది. ఇక అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు కూడా ఆ మధురానుభూతులను ఆస్వాదించారు. అయితే వీడియోలోని మహిళ హాంగర్లకు వేలాడుతున్నప్పుడు ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయిందో. ఉన్న క్షణాలను అనందంగా గడపాలని ఆమె తన విలువైన సందేశాన్ని తోటివారికి అందించింది. సరదాగా గడపడానికి వయసు, భాష, వేషంతో పట్టింపు లేదని ఈ వీడియోలోని మహిళ చాటిచెప్పింది. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ అయిన ఈ వీడియోను నెటిజన్లు తమ గుండెలకు హత్తుకున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

